Page Loader
Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజున కొనాల్సిన, కొనకూడదని వస్తుల జాబితా ఇదే!
అక్షయ తృతీయ రోజున కొనాల్సిన, కొనకూడదని వస్తుల జాబితా ఇదే!

Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజున కొనాల్సిన, కొనకూడదని వస్తుల జాబితా ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 16, 2025
03:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

అక్షయ తృతీయ రాగానే బంగారపు దుకాణాల్లో సందడి మొదలవుతుంది. ఈ పవిత్ర దినాన బంగారం కొనడం ద్వారా సంపద పెరుగుతుందని చాలామంది గట్టిగా నమ్ముతారు. 'అక్షయ' అంటే ఎప్పటికీ తగ్గని విలువ అని అర్థం. అందుకే ఈ రోజున బంగారంతోపాటు పలు ముఖ్యమైన వస్తువులు కొనడం శుభఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అక్షయ తృతీయ విశిష్టత ఈ రోజు విష్ణువు, లక్ష్మీదేవి, కుబేరుని పూజించి బంగారం కొనడం, ఆస్తులు సాదించడం, కొత్త వ్యాపారం మొదలుపెట్టడం వంటివి పవిత్రమైన కార్యాలుగా పరిగణిస్తారు. కుబేరుడు ఈ రోజున బ్రహ్మ, శివ ఆశీస్సులతో ధనాధిపతిగా మారాడని పురాణాలు చెబుతున్నాయి.

Details

 ఈ రోజు కొనవలసిన శుభ వస్తువులు

1. బంగారం అతి పవిత్రమైన లోహంగా బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. పెట్టుబడిగా ఇది మేలైనదే కాకుండా, శుభానికి చిహ్నంగా పరిగణిస్తారు. 2. కొత్త ఇల్లు ఈ రోజున ఇల్లు కొనుగోలు చేస్తే కుబేరుని ఆశీర్వాదంతో ఇంటికి శ్రేయస్సు చేకూరుతుందనే నమ్మకం ఉంది. 3. కొత్త వాహనం వాహన కొనుగోలుకు కూడా ఈ రోజును శుభముగా భావిస్తారు. శుభ ముహూర్తం చూసుకుని వాహనం కొంటే అదృష్టం దక్కుతుందని విశ్వాసం. 4. వెండి నాణెం లక్ష్మీదేవిని ప్రతినిధించే వెండి నాణెం కొనడం వల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు. లక్ష్మీ తల్లి ముద్ర ఉన్న నాణెం అయితే మరింత శ్రేయస్కరం.

Details

 5. మట్టి కుండ 

సులభంగా అందుబాటులో ఉండే ఈ వస్తువు ధనసంపదకు చిహ్నంగా నిలుస్తుంది. దీన్ని బియ్యంతో నింపి ఇంట్లో ఉంచితే శుభఫలితాలు కలుగుతాయని చెబుతారు. 6. కొత్త దుస్తులు అక్షయ తృతీయన కొత్త బట్టలు ధరించడం అదృష్టాన్ని ఆహ్వానించే సంకేతంగా భావిస్తారు. 7. పుస్తకాలు విద్యకు దేవత అయిన సరస్వతిని తలచేలా ఈ రోజున పుస్తకాలు కొనడం శ్రేయస్సుని పెంపొందిస్తుందని నమ్మకం 8. రాగి, ఇత్తడి పాత్రలు శుభప్రదమైన లోహాలైన రాగి, ఇత్తడి పాత్రలను ఈ రోజున కొనడం సౌభాగ్యానికి దారి తీస్తుందని పెద్దలు చెబుతారు.

Details

ఈ రోజు ఏవి కొనకూడదు?

పదునైన వస్తువులైన కత్తి, బ్లేడ్, సూది, గొడ్డలి మొదలైనవి కొనడం శుభప్రదం కాదు. అలాగే ప్లాస్టిక్, అల్యూమినియం పాత్రలు కూడా నివారించాలి. స్టీల్ పాత్రల కొనుగోలుపైనా కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తుంటారు. ప్రత్యేక శుభచర్యలు ఇల్లు శుభ్రంగా, ప్రకాశంగా ఉంచాలి. లక్ష్మీదేవి పూజ చేసి దీపారాధన చేయాలి. లక్ష్మీ మంత్రాలు లేదా స్తోత్రాలను పఠించాలి. దానధర్మాలు చేసి, సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఇవన్నీ కలిపి అక్షయ తృతీయను శుభఫలితాలతో నింపుతాయి.