Page Loader
Vinayaka Chaviti: వినాయక మండపాన్ని ఈ వస్తువులతో  అలంకరిస్తే.. అందానికి అందం.. శుభప్రదం కూడా..
వినాయక మండపాన్ని ఈ వస్తువులతో అలంకరిస్తే.. అందానికి అందం.. శుభప్రదం కూడా..

Vinayaka Chaviti: వినాయక మండపాన్ని ఈ వస్తువులతో  అలంకరిస్తే.. అందానికి అందం.. శుభప్రదం కూడా..

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 05, 2024
05:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

వినాయక చవితి రోజు నుంచి ప్రారంభమయ్యే గణపతి నవ రాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలు అందుకునే వినాయకుడు, పదవ రోజు నిమజ్జనంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ సమయంలో మొత్తం దేశవ్యాప్తంగా ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. గణపతి మండపాలు వివిధ రకాలుగా అలంకరిస్తారు.అదే సమయంలో అలాగే భక్తులు తమ ఇంట్లో వినాయకుడిని ప్రతిష్టిస్తారు. ఇంట్లో కూడా వినాయక విగ్రహాన్ని ఎంతో అందంగా అలంకరిస్తారు. ముఖ్యంగా,మండపాలను అలంకరించేటప్పుడు రంగులు,వస్తువుల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వినాయక చవితి రోజున"గణపతి బప్పా మోరియా,మంగళ మూర్తి మోరియా"వంటి కీర్తనలు ప్రతీ చోటా వినిపిస్తాయి. ఈ ఏడాది వినాయక చవితి పండుగ సెప్టెంబర్ 7వతేదీన వచ్చింది. మండపాలను అలంకరించేందుకు కొన్ని సూచనలు:

వివరాలు 

పసుపు లేదా ఎరుపు బట్టలు

గణపతి విగ్రహ మండపాలను అలంకరించేటప్పుడు, పీటపై పసుపు రంగు లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని పరవాలి. ఈ రంగులు గణపతికి ఇష్టమైనవిగా పరిగణించబడతాయి. అరటి ఆకులతో అలంకరణ వినాయకుని పూజా మండపాన్ని అరటి ఆకులతో అలంకరించడం, పచ్చదనంతో అందంగా కనిపించడమే కాకుండా, పవిత్రతను కూడా అందిస్తుంది. నైవేద్యం పెట్టడానికి ప్లేట్‌కు బదులుగా అరటి ఆకులను ఉపయోగించడం మంచిది.

వివరాలు 

అలంకరణలో ఈ పువ్వులను ఉపయోగించండి

పారిజాతం, పసుపు బంతిపూలు, మందార పువ్వులను వినాయకుడి మండపంలో ఉపయోగించండి. ఈ పువ్వులు గణపతికి ఇష్టమైనవిగా భావిస్తారు. దర్భ గడ్డి దర్భ గడ్డిని గణపతి పూజలో ఉపయోగించడం పవిత్రంగా పరిగణించబడుతుంది. పూలతో పాటు దర్భ గడ్డి ఉపయోగించడం ఆధ్యాత్మికమైన శ్రేష్టతను అందిస్తుంది. ఈ సూచనలను పాటించి, మీరు ఈ వినాయక చవితి ఉత్సవాలను మరింత ఘనంగా జరుపుకోవచ్చు.