Page Loader
Dry fruit lassi: పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే డ్రై ఫ్రూట్ లస్సీ ఇలా తయారు చేసుకోండి!
పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే డ్రై ఫ్రూట్ లస్సీ ఇలా తయారు చేసుకోండి!

Dry fruit lassi: పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే డ్రై ఫ్రూట్ లస్సీ ఇలా తయారు చేసుకోండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 17, 2025
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

వేసవిలో శరీరానికి చల్లదనం ఇచ్చే పానీయానికి ఎవరైనా నో చెప్పగలరా? మరి అది శక్తినివ్వడంతో పాటు ప్రోటీన్లను కూడా అందిస్తే ఇంకేమీ కావాలా! మార్కెట్‌లో దొరికే కూల్‌డ్రింక్స్‌కు బదులుగా.. ఇంట్లోనే ఆరోగ్యకరమైన, రుచికరమైన డ్రింక్ తయారుచేసుకోండి. సులభంగా చేయదగిన ఈ రుచికరమైన డ్రై ఫ్రూట్ లస్సీ మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వేసవిలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడి తాగగల ఈ ప్రత్యేక లస్సీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.

Details

కావలసిన పదార్థాలు

పెరుగు (తాజాగా) - 1 కప్పు జీడిపప్పు - 10 బాదం - 10 నల్ల ద్రాక్ష- 1 టేబుల్ స్పూన్ గుమ్మడికాయ గింజలు - 1 టీస్పూన్ పుచ్చకాయ గింజలు - 1 టీస్పూన్ సూర్యకాంత గింజలు - 1 టీస్పూన్ ర్మలకాయ గింజలు (ఫ్లాక్స్ సీడ్స్) - 1 టీస్పూన్ అక్రోట్లు - 2-3 ముక్కలు మఖానాలు (లోటస్ సీడ్స్) - 5-6 ఎండిన కొబ్బరి తురుము - 1 టీస్పూన్ కుంకుమ పువ్వు (కేసరి) - కొద్దిగా సోంపు చిటికెడు చక్కెర లేదా పంచదార- రుచికి తగినంత చిల్డ్ వాటర్ - కొద్దిగా (అవసరమైతే)

Details

తయారీ విధానం

1. జీడిపప్పు, బాదం, నల్ల ద్రాక్షలను కనీసం 2-3 గంటలు నీటిలో నానబెట్టండి. 2. పెరుగును కొద్దిసేపు ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా ఉంచండి. 3. నానబెట్టిన బాదం పైన పొట్టు తీసేయండి. 4. మిక్సీ జార్‌లో చల్లటి పెరుగు, చక్కెర, కొద్దిగా చిల్డ్ వాటర్ వేసుకోండి. 5. అందులో నానబెట్టిన జీడిపప్పు, బాదం, గింజలన్నీ (గుమ్మడికాయ, పుచ్చకాయ, సూర్యకాంతి, ఫ్లాక్స్), సోంపు వేసి మెత్తగా బ్లెండ్ చేయండి. 6. తయారైన లస్సీని గ్లాసుల్లోకి పోసి, పైన అక్రోట్ ముక్కలు, మఖానాలు, కొబ్బరి తురుము వేసి, కుంకుమ పువ్వుతో అలంకరించండి. 7. చల్లగా వడ్డించండి.

Details

 లాభాలు

ఈ డ్రై ఫ్రూట్ లస్సీ తక్షణ శక్తిని ఇచ్చే శక్తివంతమైన పానీయం. పెరుగు జీర్ణక్రియను మెరుగుపరచగా, డ్రై ఫ్రూట్స్ శరీరానికి అవసరమైన ప్రోటీన్, మంచి కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు అందిస్తాయి. విత్తనాలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ను సమకూర్చి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే ఈ లస్సీ.. ఆరోగ్యం, రుచి రెండింటికీ మేలైన ఎంపిక. ఇంట్లోనే ఈ పానీయం తక్కువ సమయంతో తయారవుతుంది. మీరు కూడా ఈ వేసవిలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలనుకుంటే.. ఈ డ్రై ఫ్రూట్ లస్సీ తప్పనిసరిగా ట్రై చేయండి!