HOLI 2026: రంగుల ఆట తర్వాత తలస్నానం ఇలా చేయండి.. జుట్టు డ్యామేజ్ కాకుండా జాగ్రత్తలు!
ఈ వార్తాకథనం ఏంటి
ఎంత ఉత్సాహంగా హోలీ ఆడుతామో.. ఆ తర్వాత ఒంటికి అంటుకున్న రంగులను తొలగించుకోవడంలో అంతే కష్టపడుతుంటాం. ఆర్గానిక్ రంగులే కాదు, కెమికల్ కలర్స్, గుడ్లు, బురద, ఆయిల్... ఇలా హోలీ వేడుకల్లో ఏదీ అతీతం కాదు. రంగులు ఎక్కువసేపు శరీరంపై ఉంటే మరింత గట్టిగా అంటిపడతాయి. అందుకే వీలైనంత త్వరగా శుభ్రం చేసుకోవడం మంచిది. హోలీ తర్వాత రంగులను సురక్షితంగా తొలగించేందుకు పాటించాల్సిన కొన్ని చిట్కాలు ఇవి...
Details
జల్దీగా రంగులు వదలాలంటే…
గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే రంగులు త్వరగా పోతాయి. అయితే వేడి నీళ్లు మాత్రం అస్సలు వాడకండి. శెనగపిండిలో పాలు, పెరుగు, రోజ్‌వాటర్, బాదం నూనె కలిపి పేస్ట్‌లా తయారు చేసి శరీరానికి పట్టించాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే రంగులు వదులుతాయి. గ్లిజరిన్, సీసాల్ట్ కలిపి అందులో కొన్ని చుక్కలు అరోమా ఆయిల్ వేసి మిశ్రమం తయారు చేయాలి. దాన్ని శరీరానికి రాసి మృదువుగా రుద్దితే రంగులు తగ్గుతాయి. రంగుల వల్ల దురద ఉంటే గ్లిజరిన్-రోజ్‌వాటర్ మిశ్రమం రాసుకోవాలి. కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ముఖానికి ముల్తాన్ మట్టి ప్యాక్ వేస్తే దురద తగ్గుతుంది.
Details
తలకు అంటిన రంగుల కోసం
కొందరు ఆయిల్ లేదా కిరోసిన్ రాసి రంగులు పోగొట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇది చర్మానికి హానికరమని డెర్మటాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. శరీరం శుభ్రం చేసుకున్న వెంటనే మాయిశ్చరైజర్ క్రీమ్ రాయడం మర్చిపోవద్దు. పెరుగులో గుడ్డు సొన కలిపి తలకు పట్టించి గంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే రంగులు తగ్గుతాయి. షాంపూ వాడాల్సి వస్తే తప్పనిసరిగా మైల్డ్ షాంపూనే ఉపయోగించాలి. ఆ తర్వాత ఆలివ్ ఆయిల్, తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి హెయిర్ ప్యాక్ వేసుకుంటే జుట్టుకు పోషణ లభిస్తుంది. ముందస్తు జాగ్రత్త... హోలీ ఆడే ముందు శరీరానికి కొబ్బరి నూనె లేదా గ్లిజరిన్ ఆయిల్ రాసుకుంటే రంగులు గట్టిగా అంటుకోవు.
Details
దుస్తులపై మరకలు పోవాలంటే
హోలీ సమయంలో చాలా మందికి దుస్తులపై రంగు మరకలు సమస్యగా మారుతాయి. కొందరు ముందే పాత బట్టలు వేసుకుంటారు. మరికొందరు ప్రత్యేకంగా కొత్త దుస్తులు కొనుక్కుంటారు. అయితే రంగు మరకలు పడితే ఇలా చేయండి డ్రెస్సులపై రంగు మరకలు ఉంటే నిమ్మరసం రుద్ది, వేడి నీటిలో నానబెట్టి ఉతకాలి. అరకప్పు వెనిగర్‌లో ఒక చెంచా లిక్విడ్ డిటర్జెంట్ కలిపి, ఆ మిశ్రమాన్ని చల్లటి నీటిలో వేసి రంగు పడిన బట్టలను నానబెట్టాలి. గంట తర్వాత ఉతికితే మరకలు తేలికగా పోతాయి. తెలుపు దుస్తులకు రంగు మరకలు అంటితే క్లోరిన్‌లో నానబెట్టి, గంట తర్వాత గోరువెచ్చని నీటితో ఉతకాలి.
Details
మరకలకు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించాలి
నిమ్మకాయ, హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా మరకలు తొలగించేందుకు ఉపయోగకరం. మూడు చెంచాల హైడ్రోజన్ పెరాక్సైడ్‌లో కొద్దిగా (జెల్ కాని) టూత్‌పేస్ట్ కలిపి ఉతికితే ప్రయోజనం ఉంటుంది. గోడలకు అంటిన రంగు మరకలను వెనిగర్‌లో ముంచిన గుడ్డతో తుడవాలి. ఫ్లోర్‌పై ఉన్న మరకలకు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించాలి. ఇవన్నీ పాటించడం కంటే ముందే జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆర్గానిక్ రంగులు వాడితే ఇలాంటి ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. కెమికల్స్ ఉన్న రంగులే ఎక్కువ సమస్యలు తెస్తాయి. కాబట్టి వీలైనంతవరకు సహజసిద్ధమైన రంగులతో హోలీని ఆనందంగా, సురక్షితంగా జరుపుకుందాం.