Araku-Lambasingi: అరుకు, లంబసింగి అందాలను చూసేందుకు ఇదే సరైన సమయం.. ప్రకృతి అందాలకు స్వాగతం
అరకు, లంబసింగి ప్రాంతాల్లో వర్షాకాలం వచ్చిందంటే చల్లని ప్రకృతి అందాలు పర్యాటకులకు పరవశం కలిగిస్తాయి. సాధారణంగా శీతాకాలంలో ఎక్కువమంది పర్యాటకులు ఇక్కడికొచ్చారు. కానీ వర్షాకాలంలో ఈ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తుంది. లంబసింగి మంచు, పొగమంచు తడిచి, పచ్చని కొండలు ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టిస్తాయి. ఎగసే మంచు మేఘాలు, పొదురు కురుస్తున్న పర్వత శిఖరాలు ఇక్కడ ఆంధ్రా కాశ్మీర్ అనిపించేలా చేస్తాయి. పచ్చని అటవీ ప్రాంతాల్లోని మలుపు తిరిగే మార్గాలు, మంచు తుంపరలు నిజంగా కనువిందు చేస్తాయి. ప్రతేడాది జూన్, అక్టోబర్, నవంబర్ నెలల్లో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంటుంది.
ఈసారి కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు
ఈసారి కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఈ ప్రాంతంలో సందర్శనకు వస్తున్నారు. పర్యాటకులు వంజంగి, జెండా కొండ వద్ద మంచు మేఘాలను ఆస్వాదిస్తూ, తెల్లవారుజామున మొదటి కిరణాలు కమ్ముకొస్తున్న ఈ ప్రాంతాన్ని ఎంతో ఆహ్లాదంగా అనుభవిస్తున్నారు. సముద్ర మట్టానికి 5,500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశంలో మైనస్ డిగ్రీలు సాధారణమే కావడంతో ఇక్కడి వాతావరణం మరింత చల్లగా ఉంటుంది. ఇక్కడకు వచ్చిన పర్యాటకులు రాత్రి టెంట్లు వేసుకుని ఉంటూ తెల్లవారుజామున మంచు కురుస్తున్న అందాలను చూస్తూ ఆనందంగా గడుపుతున్నారు.