వైరల్ వీడియో: ఏనుగులకు భయపడి పక్కకు వెళ్ళమని దారినిచ్చిన పులి
ఈ వార్తాకథనం ఏంటి
నేను పులిని ఎవ్వరికీ భయపడను అని సాధారణంగా జనాల్లో మాటలు వినిపిస్తుంటాయి. అలాంటి వాళ్ళు ఈ వీడియో చూస్తే ముక్కున వేలేసుకుంటారేమో!
ముందుకు దూకి పంజా విసరడమే తప్ప నక్కలా దాక్కోవడం పులికి తెలియదని అనుకునేవాళ్ళు ఈ వీడియోను చూస్తే తమ మాట మార్చుకుంటారు. ఏనుగులకు భయపడిన పులి, నక్కలా నక్కి నక్కి దాక్కోవడం చూసి ఆశ్చరపోతారు.
ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నంద, ట్విట్టర్ లో ఒక వీడియోను పోస్ట్ చేసారు. ఇందులో, ఒకదారిన వెళ్తున్న పులి, సడెన్ గా ఏనుగుల ఘీంకారం వినిపించడంతో ఆగిపోతుంది.
బొమ్మలా కూర్చుని ఏనుగులు వెళ్లేవరకూ అలాగే ఉంటుంది. ఏనుగులు కూడా పులి చూసి దూరం దూరంగా వెళ్తున్నాయి.
Details
జంతువుల మధ్య కమ్యూనికేషన్ బాగుందన్న ఫారెస్ట్ ఆఫీసర్
ఏనుగులు పూర్తిగా వెళ్ళే వరకు అక్కడే కూర్చున్న పులి, అవి మొత్తం వెళ్ళిపోగానే అక్కడి నుండి లేచి అటూ ఇటూ చూసింది. అంతలో మరో ఏనుగు, ఆ దారిలోంచి వస్తుండడంతో దానికి కనిపించకుండా పొదల్లోకి దూకుతుంది.
ప్రస్తుతం ఈ వీడియో, ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. ఈ వీడియోను ఎప్పుడు తీశారు? ఎక్కడ తీసారన్న సమాచారం అందుబాటులో లేదు. కానీ ఇప్పటీవరకు 20వేల మందికి పైగా ఈ వీడియోను చూసారు.
ఈ వీడియో పోస్ట్ చేసిన సుశాంత్ నందా, అడవిలో జంతువులు చాలా బాగా కమ్యూనికేట్ చేసుకుంటున్నాయని, పులిని చూసిన ఏనుగులు సైలెంట్ అయ్యాయని, అలాగే ఏనుగులను చూసిన పులి, వాటికి దారినిచ్చిందని కామెంట్ పెట్టారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నంద పోస్ట్ చేసిన వీడియో
This is how animals communicate & maintain harmony…
— Susanta Nanda (@susantananda3) April 30, 2023
Elephant trumpets on smelling the tiger. The king gives way to the titan herd😌😌
Courtesy: Vijetha Simha pic.twitter.com/PvOcKLbIud