Page Loader
వైరల్ వీడియో: సఫారీకి వెళ్ళిన స్నేహితుల గుంపును భయపెట్టిన పెద్దపులి 
సఫారీకి వెళ్ళిన వారిని భయపెడుతున్న పులి

వైరల్ వీడియో: సఫారీకి వెళ్ళిన స్నేహితుల గుంపును భయపెట్టిన పెద్దపులి 

వ్రాసిన వారు Sriram Pranateja
Apr 27, 2023
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

అడవిలో జంతువులను చూడడానికి సఫారీకి వెళ్ళిన స్నేహితుల గుంపును పులి భయపెట్టింది. సఫారీ వాహనంలో కూర్చుని పులిని ఫోటో తీస్తుండగా, సడెన్ గా వాళ్లమీదకు పరుగెత్తింది పులి. దాంతో తమ సఫారీ వాహనాన్ని అక్కడి నుండి కదిలించారు. ప్రస్తుతం ఈ వీడియో, ఇంటర్నెట్ లో వైరల్ ఐపోయింది. గాండ్రిస్తున్న పులిని చూస్తూ ఇంటర్నెట్ జనాలందరూ షాక్ అవుతున్నారు. మొదట పొదల్లో ఉన్న పులి, ఫోటోలు తీస్తుండగా భయంకరంగా గాండ్రిస్తూ సఫారీ వాహనం దగ్గరకు పరుగెత్తింది. ఈ వీడియోను ఇంటర్నెట్ లో పోస్ట్ చేసిన ఫారెస్ట్ ఆపీసర్ సుశాంత నంద, మీ ఇంట్లోకి వేరే ఎవరైనా తమ హక్కుగా వస్తే మీకెలా ఉంటుంది, పులికి కూడా అందుకే కోపమొచ్చిందన్నట్టుగా పోస్ట్ పెట్టాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సఫారీకి వెళ్ళిన వారిని భయపెడుతున్న పులి 

మీరు పూర్తి చేశారు