కంటి సంరక్షణ కోసం 6 చిట్కాలు పాటించండి
శరీరంలో కళ్ళు చాలా ముఖ్యం వాటిని సంరక్షించుకోవడానికి ఇవి పాటించండి కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్, విటమిన్లు సి, విటమిన్ ఈ వంటి పోషకాలు వయస్సు సంబంధిత దృష్టి సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి. బచ్చలికూర వంటి ఆకు కూరలు సాల్మన్, ట్యూనా వంటి చేపలు, గుడ్లు, గింజలు, బీన్స్ వంటి ప్రోటీన్ మూలాలు ఉన్న కూరగాయలు, నారింజ వంటి పండ్లు బాగా తినాలి. ఆరోగ్యకరమైన ఆహారం వలన బరువు నియంత్రణలో ఉంటుంది. ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ వంటి వ్యాధులను తగ్గిస్తుంది. సన్ గ్లాసెస్ ధరించడం వలన సూర్యుని అల్ట్రా వైలెట్ (UV ) కిరణాల నుండి కళ్ళను రక్షించడంలో సహాయపడతాయి.
కంటి వైద్యుడిని క్రమం తప్పకుండా కలవాలి
ధూమపానం వలన అనేక ఇతర వైద్య సమస్యలతో పాటు కంటిశుక్లం, కంటి నరాలు దెబ్బతినడం వంటివి జరగొచ్చు. అందుకే ఈ అలవాటును మానేయడం వలన కంటి ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుంది. ఎక్కడవున్నాసరే గాలిలో ఉండే పదార్థాల నుండి కంటికి భద్రతను ఇచ్చే అద్దాలు ధరించాలి. కంప్యూటర్, ఫోన్ స్క్రీన్ ను ఎక్కువసేపు చూస్తూ ఉండటం వలన కంటి ఆరోగ్యం దెబ్బతినచ్చు, వీటికి దూరంగా ఉండటం కంటికి మంచిది. కంటి వైద్యుడిని క్రమం తప్పకుండా కలవాలి. కంటి పరీక్షలు వలన ఎటువంటి లక్షణాలు లేని గ్లకోమా వంటి వ్యాధులు కూడా తెలిసే అవకాశం ఉంది. ముందుగానే గుర్తించడం వలన ఈ వ్యాధికి చికిత్స చేయడం తేలిక.