
Motivational: జీవితంలో మోసపోకుండా ఉండాలంటే.. చాణక్యుడు చెప్పిన ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
ఈ వార్తాకథనం ఏంటి
చాణక్యుడు—విజయవంతమైన వ్యూహకర్త, తత్వవేత్త, ఆర్థిక శాస్త్ర నిపుణుడు. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడంలో కీలకపాత్ర పోషించిన ఆయన, కేవలం పాలకులకే కాకుండా, సామాన్యుల జీవితానికీ మార్గదర్శకంగా నిలిచే అనేక నీతులు తన రచనల ద్వారా అందించారు. చిన్న వయసులో చంద్రగుప్త మౌర్యుడిని సింహాసనానికి చేర్చడం, ఆ తర్వాత ఆయనకు సమర్థమైన పాలకుడిగా మారేలా చేసిన చాణక్యుడు, తన చాణక్య నీతి గ్రంథంలో అనేక జీవిత సత్యాలను వివరించారు. ఈ గ్రంథంలోని సందేశాలు నేటికీ ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఎవరినైనా నమ్మకానికి ముందుగా పరిశీలించాల్సిన అంశాలు ఆయన స్పష్టంగా వివరించారు. ఒకరిని నమ్మాలంటే నాలుగు విషయాలను గమనించాలని చాణక్యుడు చెబుతారు.
Details
శ్లోకం
''యథా చతుర్భిః కనకం పరీక్ష్యతే నిగర్షణం ఛేదం తపతదనైః తథా చతుర్భిః పురుషం పరీక్ష్యతే త్యాగేన శీలేన గుణేన కర్మణా'' ఈ శ్లోకం చాణక్య నీతి గ్రంథం 5వ అధ్యాయం నుంచి తీసుకున్నది. దీని ప్రకారం, మనిషి నిజ స్వరూపాన్ని తెలుసుకోవాలంటే నాలుగు అంశాలపై దృష్టి పెట్టాలి:
Details
లక్షణాలు (గుణాలు) చూడాలి
ప్రతి మనిషిలో మంచి, చెడు లక్షణాలు కలగలిపి ఉంటాయి. సోమరితనంతో జీవించే వారు, అబద్ధాలపై ఆధారపడే వారు, అహంకారంతో ప్రవర్తించే వారు విశ్వసనీయులు కారని చాణక్యుడు చెబుతారు. ఎవరైతే ప్రశాంతంగా, గంభీరంగా, నిజాయతీగా మాట్లాడతారో... వారి నడవడికలో నైతికత, విలువలు కనిపిస్తాయో వారినే నమ్మాలి. త్యాగ గుణాన్ని పరిశీలించాలి తన ఆనందాన్ని ఇతరుల కోసం త్యాగం చేయగల వ్యక్తి నిజంగా విశ్వసనీయుడు. త్యాగం చేసే మనస్తత్వం ఉన్నవారు కష్ట సమయాల్లో తోడుంటారు. అలాంటి వారిని పరీక్షించి, నమ్మకం ఉంచవచ్చు.
Details
పాత్రపై స్పష్టత ఉండాలి
ఆ వ్యక్తి తన ఇంట్లో ఎలా ప్రవర్తిస్తాడు? కుటుంబంలో అతని బాధ్యతలు ఏంటి? మంచిని ప్రోత్సహిస్తాడా, చెడుకు ప్రేరేపించాడా అనే విషయాల్లో స్పష్టత పొందిన తరువాతే అతడిని విశ్వసించాలి. ఆర్థిక పరంగా పరీక్షించాలి పైసా అవసరం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ డబ్బు మీద మనిషి నిజ స్వభావం బయటపడుతుంది. కొంత డబ్బును అప్పుగా ఇచ్చి, సమయానికి తిరిగి ఇచ్చే విధానం ఎలా ఉందో చూడాలి. ఒకవేళ తిరిగి ఇవ్వకపోతే, స్వార్థపూరితంగా ప్రవర్తిస్తే, అతడి నమ్మకాన్ని మర్చిపోవాలి. ఇంతకీ.. ఎవరినైనా మన జీవితం లోకి రానివ్వాలంటే, నమ్మకంగా భావించాలంటే, చాణక్యుడు సూచించిన ఈ నాలుగు పరీక్షలూ తప్పనిసరి. ఈరోజుల్లో మోసాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఈ సూక్తులు మరింత ప్రాసంగికంగా మారుతున్నాయి.