
Motivation : జీవితంలో నష్టాలు రాకుండా ఉండాలంటే ఈ నాలుగు పనుల్లో సిగ్గుపడొద్దు!
ఈ వార్తాకథనం ఏంటి
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మన జీవితానికి సంబంధించిన అనేక అంశాలను వివరిస్తారు. విజయం, వైవాహిక జీవితం, స్నేహం వంటి ముఖ్య విషయాలపై ఆయన సూచనలు ఇవ్వడం తెలిసిందే. అందులో భాగంగా, ఈ నాలుగు పనులు చేసేటప్పుడు ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ సిగ్గు లేదా ఇబ్బంది పడకూడదని ఆయన చెప్పడం గమనార్హం. ఎందుకంటే ఇలా చేస్తే మనకు నష్టాలు రావడం సహజం అని ఆయన సూచించారు. ఇప్పుడు ఏ విషయాల్లో సిగ్గు పడకూడదో చూద్దాం
Details
1. సంపాదన
జీవించడానికి డబ్బు అవసరం. అందుకే, సంపాదనలో సిగ్గు పడకూడదు అని చాణక్యుడు సూచించారు. ఎందుకంటే మనం పని చేస్తూ కూడా సిగ్గుపడితే, ఒక్క రూపాయి కూడా సంపాదించలేము. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుడు మార్గాల ద్వారా డబ్బు సంపాదించకూడదు. 2. అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి అడగడం ఎవరికి అప్పు ఇచ్చిన తర్వాత వారు సకాలంలో తిరిగి ఇవ్వకపోతే, దాన్ని అడగడానికి వెనుకాడకూడదని చాణక్యుడు చెప్పారు. ఈ విషయంలో సిగ్గు పడితే, మనకు నష్టం కలుగుతుందని ఆయన హెచ్చరించారు.
Details
3. ఆహారం
పురుషులు లేదా స్త్రీలు ఆహారం విషయంలో సిగ్గు పడకూడదు. చాలామంది బయటకు వెళ్ళినప్పుడు ఇతరులు ఏమనుకుంటారని ఆహారం తీసుకోవడంలో వెనుకాడతారు. దీని వల్ల ఆకలితో సమయం గడుపుకోవలసి వస్తుంది. అందుకే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం విషయంలో సిగ్గు పడాల్సిన అవసరం లేదు. 4. అభ్యాసం గురువుల దగ్గర లేదా తెలిసిన వ్యక్తుల నుంచి నేర్చుకోవడంలో సిగ్గు పడకూడదు. మనకు ఏదైనా విషయం తెలియకపోతే, సిగ్గు పక్కన పెట్టి తెలిసినవారి నుండి సరైన జ్ఞానాన్ని పొందాలి. సిగ్గు వల్ల జ్ఞానం పొందే అవకాశాన్ని కోల్పోతామని చాణక్యుడు సూచించారు.