Health Benefits: ఆరోగ్యంగా ఎక్కువకాలం జీవించాలంటే ఈ 5 లైఫ్‌స్టైల్ సీక్రెట్స్ పాటించాల్సిందే
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతి ఒక్కరూ ఎక్కువకాలం జీవించాలని కోరుకుంటారు. అందుకోసం ఏదైనా మ్యాజిక్ పిల్, సూపర్‌ఫుడ్ స్మూతీ లేదా ట్రెండీ ఛాలెంజ్ కోసం వెతుకుతుంటారు. కానీ నిజంగా దీర్ఘాయుష్షుకు దారి చూపించే తాళాలు మనం తరచూ పట్టించుకోని కొన్ని సాధారణ జీవనశైలి అలవాట్లలోనే దాగి ఉన్నాయి. ఆరోగ్యంగా వృద్ధాప్యంలోకి అడుగుపెట్టాలంటే నిపుణులు చెబుతున్న విషయం చాలా స్పష్టం - కొన్ని మంచి అలవాట్లను అలవర్చుకుని, వాటిని నిలకడగా కొనసాగించాలి. ఈ మార్గంలో సహనం, క్రమశిక్షణ, ఆత్మ నియంత్రణ అవసరం. అయితే ఈ అలవాట్ల అసలైన బలం కూడా ఇదే.
Details
1. స్ట్రెంత్ ట్రైనింగ్ (బల శిక్షణ)
వయసు పెరుగుతున్న కొద్దీ కండరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, జీవక్రియను సక్రమంగా కొనసాగించడం కోసం స్ట్రెంత్ ట్రైనింగ్ అత్యంత అవసరం. ఆడ్స్ ఫిట్‌నెస్‌కు చెందిన హెల్త్ అండ్ వెల్‌నెస్ నిపుణురాలు డాక్టర్ దివ్య సఖాల్కర్ మాట్లాడుతూ, "స్ట్రెంత్ ట్రైనింగ్ కండర ద్రవ్యరాశిని కాపాడుతుంది. కండరాలు గ్లూకోజ్ నిర్వహణకు కీలక కేంద్రాలుగా పనిచేస్తాయి" అని తెలిపారు. రెసిస్టెన్స్ వ్యాయామాల ద్వారా కండరాలు రక్తంలో చక్కెరను మరింత సమర్థవంతంగా ప్రాసెస్ చేయగలుగుతాయి. దీని వల్ల జీవక్రియలో వచ్చే హెచ్చుతగ్గులు తగ్గుతాయి.
Details
శారీరక బలం పెరుగుతుంది
అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ అధ్యయనం ప్రకారం, క్రమం తప్పకుండా స్ట్రెంత్ ట్రైనింగ్ చేసే వారిలో టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 30-50 శాతం వరకు తక్కువగా ఉంటుంది. హార్వర్డ్ శిక్షణ పొందిన ఫిట్‌నెస్ నిపుణుడు అసద్ హుస్సేన్ కూడా, "వారానికి కొన్ని సార్లు బరువులతో వర్కౌట్ చేయడం గుండెపోటు, చిత్తవైకల్యం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శారీరక బలం పెరుగుతుందని తెలిపారు.
Details
2. చక్కెర వినియోగంపై నియంత్రణ
చక్కెర రుచికరంగా అనిపించినా, ముఖ్యంగా వయసు పెరుగుతున్నకొద్దీ అది శరీరానికి హానికరంగా మారుతుంది. డాక్టర్ సఖాల్కర్ వివరిస్తూ, "అధిక చక్కెర తీసుకోవడం గ్లైకేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. దీనివల్ల శరీరంలో వాపు ఏర్పడి, కాలక్రమేణా కణజాలం దెబ్బతింటుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని చెప్పారు. 'ఫ్రంట్ ఫైర్స్ఇన్ ఇమ్యునాలజీ' జర్నల్‌లో ప్రచురితమైన ఒక తాజా అధ్యయనం ప్రకారం, కేవలం మూడు వారాలు అదనపు చక్కెరను తగ్గించినా వాపు సూచికలు 15శాతం వరకు తగ్గినట్లు వెల్లడైంది. అసద్ హుస్సేన్ సమతుల్య ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలని, చక్కెర వినియోగాన్ని జాగ్రత్తగా గమనించాలన్నారు. ప్రాసెస్ చేసిన చక్కెరలను తగ్గిస్తే శక్తి స్థాయిలు స్థిరంగా ఉంటాయి, అలసటతో పాటు అనవసరమైన బరువు పెరుగుదలను కూడా నివారించవచ్చు.
Details
3. సమతుల్య కార్యాచరణ దినచర్య
వారంలో సమతుల్యమైన వ్యాయామ దినచర్యను పాటించడం ఓర్పు, గుండె ఆరోగ్యం, జీవక్రియకు ఎంతో కీలకం. డాక్టర్ సఖాల్కర్ స్ట్రెంత్ ట్రైనింగ్, మోస్తరు కార్డియో, మొబిలిటీ వ్యాయామాల సమ్మేళనాన్ని సూచిస్తున్నారు. ఈ విధమైన సమతుల్య దినచర్య వయసు పెరిగేకొద్దీ రోజువారీ శారీరక అవసరాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు శరీరానికి తోడ్పడుతుంది. "దీర్ఘాయుష్షు తీవ్రతలో కాదు, నిలకడలో ఉందని అసద్ హుస్సేన్ చెబుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కాలక్రమేణా బలం, వశ్యత పెరుగుతాయి. రోజుకు కేవలం 30 నిమిషాలు చురుకైన నడక లేదా సైక్లింగ్ వంటి మోడరేట్ వ్యాయామం చేసినా గుండె ఆరోగ్యం, జీవక్రియ గణనీయంగా మెరుగుపడతాయి.
Details
4. నిద్ర, రికవరీకి ప్రాధాన్యత
జీవక్రియ సక్రమంగా పనిచేయాలంటే నాణ్యమైన నిద్ర అత్యంత అవసరం. డాక్టర్ సఖాల్కర్ మాట్లాడుతూ, "మంచి నిద్ర హార్మోన్ల నియంత్రణకు, ఆకలి నిర్వహణకు, శరీర రికవరీకి కీలకం. తగినంత విశ్రాంతి లేకుండా ఆలస్యంగా మేల్కొంటే శరీరం కోలుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుందని తెలిపారు. ఇది జీవక్రియ లయను దెబ్బతీస్తుంది. అసద్ హుస్సేన్ కూడా రికవరీకి నిద్ర ఎంత ముఖ్యమో నొక్కి చెప్పారు. నిద్రను విలాసంగా కాకుండా ఆరోగ్యానికి అవసరమైన అంశంగా భావించాలి. ప్రతిరోజూ 7-9 గంటల గాఢ నిద్ర లక్ష్యంగా పెట్టుకోవాలి. శరీరం విశ్రాంతికి సిద్ధమవుతుందన్న సంకేతంగా ప్రశాంతమైన నిద్రవేళ దినచర్యను అలవర్చుకోవడం మంచిది.
Details
5. సుస్థిర జీవనశైలి అలవాట్లు
సుస్థిరంగా జీవించడం దీర్ఘకాలిక ఆరోగ్యానికి కీలకం. ఇక్కడ నిలకడే ప్రధాన పాత్ర పోషిస్తుంది. "దీర్ఘకాలిక జీవక్రియ ఆరోగ్యం చిన్న చిన్న, పునరావృత అలవాట్ల నుంచే ఏర్పడుతుందని నిపుణులు పేర్కొన్నారు. క్రమబద్ధమైన భోజనం, ప్రతిరోజూ శరీరాన్ని కదిలించడం, ఒత్తిడిని సమర్థంగా నిర్వహించడం వంటి అలవాట్లు శరీరానికి బలమైన పునాది వేస్తాయి. వయసు పెరిగినా ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు సాధారణంగా క్రమశిక్షణ గల దినచర్యను పాటిస్తారని అసద్ సూచించారు. పోషకాహారం సిద్ధం చేసుకోవడం, రోజూ నడకకు వెళ్లడం, ఒత్తిడిని తగ్గించేందుకు మైండ్‌ఫుల్‌నెస్‌ను అనుసరించడం వంటి అలవాట్లు ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రోత్సహిస్తాయి. ఈ అలవాట్లు మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా సమతుల్యంగా ఉంచడమే కాకుండా, ఉల్లాసంగా, శక్తివంతంగా జీవించేందుకు బలమైన పునాది వేస్తాయి.