Mauni Amavasya 2026: ఇవాళ మౌని అమావాస్య.. ఈ నియమాలు పాటిస్తే ధన లాభం గ్యారెంటీ!
ఈ వార్తాకథనం ఏంటి
మాఘ అమావాస్యను మౌని అమావాస్య అని పిలుస్తారు. ఈ మాసంలోని అమావాస్య ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం వచ్చినందున, మంగళవారం + అమావాస్య కలయిక వల్ల దీనిని 'భౌమ అమావాస్య'గా కూడా పిలుస్తారు. పండితుల ప్రకారం, మౌని అమావాస్య రోజున 'మౌన వ్రతం' పాటించడం అత్యంత శుభకరంగా ఉంటుంది. ఈ రోజున సాధ్యమైనంత మౌనంగా ఉండటం ద్వారా అద్భుత ఫలితాలు లభిస్తాయి.
Details
గంగా స్నానం
గంగా స్నానం చేయడం అత్యంత మంగళం.
గంగా నీళ్లు లేకపోతే, కొద్దిగా గంగా జలం కలిపి ఆ నీళ్లలో స్నానం చేసి, గంగా అని మానసికంగా స్మరించాలి.
మూగ జీవాలకు దానం
జంతువులు, పక్షులకు ఆహారం అందించడం ద్వారా గ్రహ దోషాలు తొలగిపోతాయి.
మౌని అమావాస్య రోజున మూగజీవాలకు ఆహారం పెట్టడం
మంచి ఫలితాలను ఇస్తుంది.
సూర్యునికి అర్గ్యం
అమావాస్య రోజు సూర్యుని ఆరాధించడం ముఖ్యము.
రాగి చెంబులో నీళ్లు తీసుకుని, వాటిలో ఎర్ర చందనం, కుంకుమ కలిపి అక్షితలు, ఎర్ర పువ్వులు వేసి తూర్పు వైపున ఓం సవిత్రే నమ: 12 సార్లు జపం చేసి అర్గ్యం ఇవ్వాలి.
అర్గ్యం ఇచ్చిన నీళ్లు మొక్కలకు పోయడం ద్వారా విశేష ఫలితాలు లభిస్తాయి.
Details
మౌని అమావాస్య రోజున దానాలు
గుప్త దానం (రహస్య దానం): దానం ఇచ్చిన విషయం ఎవరికీ చెప్పకూడదు.
దానం చేయగల వస్తువులు: మంచం, ధాన్యం, వస్త్రాలు, ధనం, పాదరక్షలు.
జాతకంలో సూర్యుడు, శని బలంగా ఉంటాయి.
పెళ్లి ఆలస్యం అవుతున్నవారికి: గోధుమలు, బెల్లం, నెయ్యి పంతులు ఇవ్వడం ద్వారా మంగళ దోషాలు తొలగుతాయి.
పితృ దోషాలు, శాపాలు తొలగించడానికి: నల్ల నువ్వులు లేదా గుడిలో దర్బాసనం పంతులు ఇవ్వాలి. 7 తరాల వరకు వంశం బాగుంటుంది.
అన్నదానం జరిగే చోట ఉప్పు దానం చేయడం ద్వారా నర దిష్టి, శత్రు బాధలు తొలగిపోతాయి.
అనారోగ్యంతో ఉన్న వారికి ధనం ఇవ్వడం వంశాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
గుమ్మడికాయ దానం బంగారం దానానికి సమాన ఫలితాలను ఇస్తుంది.
Details
మౌని అమావాస్య పూజలు
శివాలయంలో వీరభద్రుడి దర్శనం, అభిషేకం చేయించాలి.
వీరభద్రుడు లేని చోట కాలబైరవుడిని దర్శించాలి.
కాలబైరవుడికి 21, 24, 27, లేదా 36 నిమ్మకాల దండ సమర్పించాలి.
భద్రకాళి అమ్మవారి ఆలయం దర్శనమవ్వాలి.
భద్రకాళి అమ్మవారికి కుంకుమ అర్చన చేయించి, 21, 54 లేదా 108 నిమ్మకాల దండ సమర్పించాలి.
వీటివల్ల శత్రుదోషాలు, దృష్టి దోషాలు, బ్లాక్ మ్యాజిక్, అనారోగ్య సమస్యలు, పాపాలు తొలగి సమస్త శుభాలు లభిస్తాయి.