చంద్రుడి మీద నడుస్తున్న అనుభూతిని అందించే ఈజిప్టులోని ఈ ప్రదేశాన్ని సందర్శించండి
ప్రపంచ పర్యటన చేయాలనుకునేవారు తమ కోరికల లిస్టులో ఈజిప్టు దేశాన్ని కచ్చితంగా చేర్చుకుంటారు. చూపు తిప్పుకోలేని మైదానాలు, పెద్ద పెద్ద పిరమిడ్లు మొదలైన వాటిని చూడాలనుకుని ఈజిప్టు దేశానికి వెళ్తుంటారు. ఇవే కాకుండా ఈజిప్టులో చాలా ప్రదేశాలు మంచి అనుభవాన్ని అందిస్తాయి. ప్రస్తుతం ఆ ప్రదేశాలు ఏంటో తెలుసుకుందాం. సిటీ ఆఫ్ డెడ్: ఎల్ మినియా నగరంలో ఉన్న ఈ ప్రాంతం ఒక స్మశాన వాటిక. కొన్ని కిలోమీటర్ల వరకు ఈ స్మశాన వాటిక విస్తరించి ఉంటుంది. ఈ ప్రాంతానికి వెళ్లాలనుకునే వారు సాధారణ దుస్తులు ధరించాలి. ఈ స్మశానాన్ని ముస్లింలు, క్రైస్తవులు ఉపయోగిస్తారు.
మునిగిపోయిన నగరం
ఈజిప్టు పురాతన గ్రంథాల్లో మునిగిపోయిన నగరం గురించి కొన్ని వివరణలు ఉన్నాయి. అలెగ్జాండ్రియా తీరానికి 6.5కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మునిగిపోయిన నగరాన్ని మీరు చూడవచ్చు. తిమింగలాల ప్రాంతం: దీన్ని.. వాడి అల్ హితన్ అంటారు. ఈ ప్రాంతంలో తిమింగలాల శిలాజాలు కనిపిస్తాయి. ఒకప్పుడు తిమింగలాలు భూమి మీద నివసించేవని చెప్పడానికి సాక్ష్యంగా ఈ శిలాజాలు ఉన్నాయి. 2005లో ఈ ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. తెల్లని ఎడారి: చంద్రుడి ఉపరితలం తెల్లగా ఉంటుంది. ఈజిప్ట్ లోని కైరో సమీపంలో గల ప్రాంతంలో నేల మొత్తం తెల్లగా ఉంటుంది. ఇక్కడ నడిస్తే చంద్రుని ఉపరితలం మీద నడిచినట్టుగా అనిపిస్తుంది. ఇసుక తుఫానుల కారణంగా ఇలాంటి తెల్లటి ప్రదేశం ఏర్పడిందని చెబుతారు.