ట్రావెల్: మెట్రోలో నీళ్లు తాగడం సహా సింగపూర్ దేశంలో చేయకూడని కొన్ని పొరపాట్లు
ఈ వార్తాకథనం ఏంటి
సింగపూర్ చాలా చిన్న దేశం. ఇదొక ద్వీపం. ప్రతి సంవత్సరం లక్షలాదిమంది పర్యాటకులు సింగపూర్ సందర్శనకు వస్తుంటారు.
ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు, ప్రాంతాలు చాలా ఉన్నాయి. అయితే, సింగపూర్ పర్యటనలో కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాప్ స్టిక్స్ తో ఆడవద్దు:
సింగపూర్ లో భోజనం చేసేటప్పుడు చాప్ స్టిక్స్ తో ఆడడం అస్సలు మంచిది కాదు. ఇదేమీ తీవ్రమైన తప్పు కానప్పటికీ సింగపూర్ స్థానికులు చాప్ స్టిక్స్ తో ఆడడం అమర్యాదగా భావిస్తారు.
అందుకే చాప్ స్టిక్స్ ని ఎలా ఉపయోగించాలో ముందుగా తెలుసుకోవడం మంచిది లేదంటే అక్కడి స్థానికులు కోపం తెచ్చుకుంటారు.
Details
సింగపూర్ లో చేయకూడని పొరపాట్లు
వీధుల్లో ఉమ్మి వేయకూడదు
సింగపూర్ చాలా శుభ్రంగా ఉంటుంది. అక్కడి స్థానికులు శుభ్రత విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. పొరపాటున మీరు వీధుల్లో ఉమ్మి వేస్తే మీపై తీవ్రంగా కోప్పడతారు.
అంతేకాదు 500 సింగపూర్ డాలర్లు ఫైన్ కూడా ఉంటుంది. అంటే దాదాపు 30,740రూపాయలు అన్నమాట.
ఆహారంపై జోకులు వేయకూడదు
కోడి కాళ్ళు తినడం మీకు అదోలా అనిపించవచ్చు. కానీ సింగపూర్ ప్రజలు దాన్ని చాలా ఇష్టంగా తింటారు. అది చూసి మీరు జోక్స్ వేస్తే మీపై కోప్పడతారు.
మెట్రో రైలులో తినకూడదు, తాగకూడదు:
మెట్రో రైలులో ఒకవేళ తిన్నా, తాగినా 30,740రూపాయలు ఫైన్ వేస్తారు. ఒక్కోసారి నీళ్లు తాగినా కూడా ఈ ఫైన్ వేసే అవకాశం ఉంది.