
రాజస్థాన్ పర్యటనకు వెళ్తున్నారా? జీఐ ట్యాగ్ అందుకున్న ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
జీఐ ట్యాగ్:
జియోగ్రాఫికల్ ఇండికేషన్ (భౌగోళిక గుర్తింపు) అనేది ఒక ప్రాంతంలో తయారైన వస్తువును, ఆ ప్రాంత వల్ల ఆ వస్తువుకు వచ్చిన విశిష్టతను తెలియజేస్తుంది.
ఆ వస్తువు వల్ల ఆ ప్రాంతానికి ప్రత్యేకమైన గుర్తింపు వస్తే, ఆ వస్తువులకు జీఐ ట్యాగ్ అందజేస్తారు. ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలోని జీఐ ట్యాగ్ అందుకున్న కొన్ని వస్తువుల గురించి మాట్లాడుకుందాం.
బగ్రు పెయింటింగ్:
రాజస్థాన్ రాష్ట్రంలో చిప తెగలకు చెందిన ప్రజలు ఈ బగ్రు పెయింటింగ్ ని వాడుతుంటారు. చెక్కముక్కకు డిజైన్స్ వేసి, దాన్ని రంగుల్లో ముంచి వస్త్రాల మీద అద్దుతారు. రాజస్థాన్ లోని గ్రామాల్లో ఈ పెయింటింగ్ వస్తువులు కనబడుతుంటాయి.
Details
రాజస్థాన్ లో జీఐ ట్యాగ్ అందుకున్న వస్తువులు
నీలిరంగు కుండలు:
17వ శతాబ్ద కాలం నుండి ఈ కళాకృతులను తయారు చేస్తున్నారు. వీటిని తయారు చేయడానికి బంకమట్టిని ఉపయోగించరు. ముల్తాన్ మట్టి, బోరాక్స్, గ్లాస్ పౌడర్, క్వార్ట్జ్ రాతిపొడిని ఉపయోగించి తయారు చేస్తారు.
కట్ పుత్లిస్:
దీనికి 2008లో జీఐ ట్యాగ్ వరించింది. ఇవి చెక్కతో చేసిన బొమ్మలు. వీటి ఆధారంగా భారత పౌరాణిక గాథలు చెబుతుంటారు. ఇలాంటి చిన్న బొమ్మలను ఇంట్లో, కార్లో పెట్టుకోవచ్చు.
సోజత్ మెహందీ:
2022లో దీనికి జీఐ ట్యాగ్ లభించింది. సోజత్ ప్రాంతంలో ఈ మెహిందీ ఎక్కువగా లభిస్తుంది. ఈ ప్రాంతాన్ని మెహందీ నగరం అని కూడా పిలుస్తారు. భారతదేశంలో మెహందీ ఉత్పత్తి ఎక్కువగా ఇక్కడే జరుగుతుంది.