జీఐ ట్యాగ్ అందుకున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి
జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అందుకున్న వస్తువులకు చాలా ప్రత్యేకత ఉంటుంది. జీఐ ట్యాగ్ అందుకున్న వస్తువులు వేరే ప్రాంతాల్లో లభించాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. ఐతే ప్రస్తుతం జీఐ ట్యాగ్ అందుకున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరు వస్తువుల గురించి మాట్లాడుకుందాం. తిరుపతి లడ్డు: శ్రీ వెంకటేశ్వర్ స్వామి ప్రసాదానికి 2014లో జీఐ ట్యాగ్ వచ్చింది. ఈ ప్రసాదానికి ఉండే విశిష్టత, రుచి, విభిన్నత కారణంగా ఈ ట్యాగ్ వచ్చింది. దాదాపు ప్రతీ తెలుగు వారు తిరుపతి లడ్డును తినే ఉంటారు. కొండపల్లి బొమ్మలు: కృష్ణా జిల్లాలోని కొండపల్లి గ్రామంలో వీటిని తయారు చేస్తారు. కలపతో చేసే ఈ బొమ్మలు చూడముచ్చటగా ఉంటాయి. ప్రస్తుతం ఆన్ లైన్ లో కూడా అందుబాటులో ఉంటున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో జీఐ ట్యాగ్ అందుకున్న కొన్ని వస్తువులు
బొబ్బిలి వీణ: బొబ్బిలి ప్రాంతంలో తయారయ్యే వీణ వాయిద్యాలకు 2011లో జీఐ ట్యాగ్ లభించింది. మీరు సంగీతాన్ని ఇష్టపడితే బొబ్బిలి వీణ వాయిద్యాన్ని మీ ఇంటికి తెచ్చేసుకోండి. హైదరాబాద్ హలీమ్: రంజాన్ మాసంలో హోటళ్లలో, రెస్టారెంట్లలో, ఇళ్ళలో ఈ వంటకాన్ని ఎక్కువగా ఆరగిస్తారు. 2010లో హైదరాబాద్ హలీకు జీఐ ట్యాగ్ లభించింది. నిర్మల్ కొయ్యబొమ్మలు: నిర్మల్ జిల్లాలో తయారయ్యే కొయ్యబొమ్మలు ప్రత్యేకంగా ఉంటాయి. 2009లో వీటికి జీఐ ట్యాగ్ లభించింది. నిర్మల్ వెళ్ళినపుడు మీ ఇంటికి తెచ్చేసుకోండి. పోచంపల్లి ఇక్కత్: యాదాద్రి భువనగిరి జిల్లాలో బూదాన్ పోచంప గ్రామంలో తయారయ్యే పోచంపల్లి ఇక్కత్ డిజైన్ చీరలకు 2005లో భౌగోళిక గుర్తింపు(జీఐ) ట్యాగ్ వచ్చింది. ఈ డిజైన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి