Page Loader
Ms Dhoni: ధోని టీ షర్ట్ ధర.. ఐఫోన్ 15 ప్లస్ విలువకు సమానం!
ధోని టీ షర్ట్ ధర.. ఐఫోన్ 15 ప్లస్ విలువకు సమానం!

Ms Dhoni: ధోని టీ షర్ట్ ధర.. ఐఫోన్ 15 ప్లస్ విలువకు సమానం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 13, 2025
05:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోని మరోసారి కొత్త లుక్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. తాజాగా ఎంఎస్ ధోని ధరించిన మ్యూజికల్‌ షర్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ చొక్కాపై పియానో బటన్లు, మ్యూజిక్ నోట్స్‌ డిజైన్‌ చేసిన స్టైల్‌ వినూత్నంగా ఉండటంతో అభిమానుల ఆసక్తిని రేకెత్తించింది. అద్భుతమైన నాయకత్వం ద్వారా ప్రేక్షకుల మనసు గెలిచిన ధోని.. ఇప్పుడు మరో కొత్త అవతారంలో కనిపించనున్నారు. జార్ఖండ్‌ పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా బాధ్యతలు చేపట్టేందుకు ధోని అంగీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక, కళాసంస్కృతి, క్రీడల శాఖ మంత్రి సుదివ్య కుమార్‌ సోనును ఆయన JSCA స్టేడియంలో కలిశారు.

Details

సోషల్ మీడియాలో టీషర్ట్ వైరల్

ఆ సందర్భంగా ధోని ధరించిన నేవీ బ్లూ హాఫ్‌ స్లీవ్‌ షర్ట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చక్కటి పట్టు వస్త్రంతో రూపొందించిన ఈ చొక్కాపై మ్యూజిక్ నోట్స్‌, పియానో కీల్‌ డిజైన్‌ ముద్రించబడి ఉండటం విశేషం. భుజం నుంచి ఛాతీ వరకూ డిజైన్ చేసిన బ్రాండ్ పేరు "పియానో కీల్స్‌" షర్టుకు ప్రత్యేక ఆకర్షణ కల్పించింది. ఇంతలో ఈ చొక్కా ధర మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇది అమెరికాకు చెందిన లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ "అమిరి" ఉత్పత్తి. దీని ధర దాదాపు $865 (సుమారు రూ.72,000). అంటే, ఈ ధరలో ఒక కొత్త ఐఫోన్ 15 ప్లస్ కొనుగోలు చేయొచ్చు. స్టైలిష్‌ దుస్తుల విషయంలోనూ ధోని తన మార్క్ చూపించారు.