తదుపరి వార్తా కథనం

Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jul 13, 2025
04:56 pm
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతిపట్ల సంతాపం ప్రకటించారు. ఆయన మృతిని బాధాకరమైన విషాదంగా పేర్కొన్నారు. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా పేర్కొంటూ కోట శ్రీనివాసరావు గారి మృతి మనందరినీ తీవ్రంగా కలిచివేసింది. సినిమాపై ఆయనకున్న అంకితభావం, బహుముఖ ప్రజ్ఞతో ఆయన ఎన్నో తరాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనతో పాటు సామాజిక సేవలోనూ ఆయన ముందుండారు. పేదల అభ్యున్నతి కోసం విశేషంగా శ్రమించారు. ఆయన సేవలు స్మరణీయంగా నిలుస్తాయి. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి అంటూ నివాళులర్పించారు.