సికిల్ సెల్ అనీమియా అంటే ఏమిటి? కేంద్ర బడ్జెట్ లో పస్తావన ఎందుకు వచ్చింది?
కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెడుతున్నప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిని 2047 సరికల్లా పూర్తిగా నిర్మూలిస్తామని తెలిపింది. సికిల్ సెల్ అనీమియా అంటే ఏమిటి? ఇది ఎర్ర రక్తకణాలకు వచ్చే జన్యుపరమైన సమస్య. సాధారణంగా ఎర్ర రక్తకణాలు గుండ్రంగా ఉంటాయి. సికిల్ సెల్ అనీమియా కారణంగా ఎర్ర రక్తకణాల ఆకారం మారిపోతుంది. గుండ్రంగా ఉన్న ఆకారం కాస్త కొడవలి ఆకారంలోకి మారిపోతుంటాయి. సికిల్ సెల్ ఎనీమియా ఎందుకు వస్తుంది? ముందే చెప్పినట్టు జన్యుపరమైన మార్పుల వల్ల వస్తుంది. ఎర్ర రక్తకణాల్లోని హీమోగ్లోబిన్ ద్వారా ఊపిరితిత్తుల నుండి ఇతర శరీర అవయవాలకు ఆక్సిజన్ అందుతుంది. రక్తకణాల ఆకారం విరిగిపోవడం వల్ల ఆక్సిజన్ అందడంలో ఇబ్బంది కలుగుతుంది.
చిన్నపిల్లల్లో సికిల్ సెల్ ఎనీమియా వచ్చే అవకాశం ఎక్కువ
ఆఫ్రికా, ఇండియా, కరీబియన్ ప్రాంత ప్రజల్లో ఈ జన్యుపరమైన ఇబ్బంది ఎక్కువగా కనిపిస్తుంటుంది. 3సంవత్సరాల వయసు కంటే తక్కువ గల పిల్లలకు ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంటుంది. ఇండియాలో గిరిజనుల్లో ఎక్కువ కనిపిస్తుంది. 86మంది కొత్తగా జన్మించిన శిశువుల్లో ఒక్క శిశువుపై ఈ వ్యాధి ప్రభావం ఉంటుంది. లక్షణాలు ఈ వ్యాధిలో చాలా రకాలున్నప్పటికీ లక్షణాలు మాత్రం ఒకేరకంగా ఉంటాయి. తీవ్ర అలసట, విపరీతమైన చిరాకు, కిడ్నీ సమస్యలు, కామెర్లు, శరీరంలో ఉబ్బు, నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి. ట్రీట్ మెంట్: ఇంట్రావీనస్ ఫ్లూయిడ్ రీహైడ్రేషన్ అనే ప్రక్రియ ద్వారా దీన్ని తగ్గించవచ్చు. నొప్పి తగ్గించే మెడిసిన్లు, బోన్ మారో మార్పు ద్వారా కూడా ఈ పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొస్తారు.