మీ శరీరానికి 5రకాల ఆరోగ్యాన్ని అందించే సుగంధ చందనం
ఆయుర్వేద మూలికయిన గంధపు చెట్ల నుండి వచ్చే చందనం, ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. ఈ చందనం, నూనె రూపంలో, పొడిరూపంలో మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. అబ్బురపరిచే సువాసన కారణంగా దీని ఖరీదు ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం దీని ఉపయోగాలు తెలుసుకుందాం. చర్మాన్ని సంరక్షిస్తుంది: వయసు పెరగకుండా నిరోధించే లక్షణాలు చందనంలో పుష్కలంగా ఉన్నాయి. దీనివల్ల చర్మం వదులుగా మారదు, అలాగే ముడతలు ఏర్పడవు. ఇంకా ముఖం మీద మొటిమలను, నల్లమచ్చలను ఇది దూరం చేస్తుంది. యాంగ్జాయిటీ తగ్గిస్తుంది: చందనం నూనె వాడటం వల్ల యాంగ్జాయిటీ, ఒత్తిడి, అలసట దూరమవుతాయి. అలాగే చందనం వాసన పీల్చిన వారిలో రక్తప్రసరణ మెరుగ్గా ఉందని ఉందని ఒక అధ్యయనంలో తేలింది.
మూత్ర సంబంధిత ఇబ్బందులను దూరం చేసే చందనం
చందనం నూనె, పొడిలో ఉండే పోషకాలు శరీరంలోని మలినాలను బయటకు పంపివేస్తాయి. గోరువెచ్చని పాలలో కొన్ని చుక్కల చందనం నూనె పోసుకుని తాగితే మూత్ర సంబంధిత ఇబ్బందులు దూరమవుతాయి. కండరాలను విశ్రాంతి పరుస్తుంది: కండరాలను విశ్రాంత పరిచే గుణాలు చందనంలో ఉంటాయి. చందనం నూనె తీసుకుని కండరాలకు మర్దన చేస్తే కండరాలు విశ్రాంతి పొందడంతో పాటు రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. వైరల్ వ్యాధులను దూరం చేస్తుంది: వైరల్ వ్యాధులైన జలుబు, దగ్గు, జ్వరం, గవదబిళ్ళలు వంటి వ్యాధులను దూరం చేయడలో చందనం నూనె బాగా పనిచేస్తుంది. నీరసంతో వచ్చే జ్వరాన్ని కూడా చందనం నూనె తగ్గిస్తుంది. అందుకే చందనాన్ని అప్పుడప్పుడైనా వాడుతూ ఉంటే ఆరోగ్యమైన శరీరం మీ సొంతం అవుతుంది.