Travel: ముంబై నగరంలో ఖచ్చితంగా సందర్శించాల్సిన పర్యాటక ప్రాంతాలు
ముంబై.. దీన్ని కలల నగరం అంటారు. ఎందుకంటే తాము కోరుకున్న కలలని ముంబై నగరంలో నెరవేర్చుకోవచ్చనే నమ్మకంతో. అప్పట్లో చాలామంది బ్రతకడానికి ముంబై వెళ్లేవారు. ముంబై వెళితే ఏ పనైనా చేసుకోవచ్చనే నమ్మకం ఉండేది. అందుకే భారతదేశ వ్యాప్తంగా ముంబైకి అంతటి పేరు వచ్చింది. అయితే ముంబై నగరంలో చూడాల్సిన పర్యటక ప్రాంతాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం అవేంటో తెలుసుకుందాం. గేట్ వే ఆఫ్ ఇండియా: ముంబైలో చూడాల్సిన ప్రాంతాలు అనగానే అందరికీ గుర్తొచ్చే ఏకైక కట్టడం గేట్ వే ఆఫ్ ఇండియా. అరేబియా సముద్రపు ఒడ్డున ఉండే ఈ కట్టడం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సాయంత్రం పూట ఈ ప్రాంతంలో ప్రశాంతంగా తిరుగుతూ ఫోటోలు దిగుతూ జ్ఞాపకాలని దాచుకోవచ్చు.
జుహూ బీచ్
ముంబైలో బీచులు చాలా ఫేమస్. అందులో జుహూ బీచ్ ఇంకా ఫేమస్. సాయంత్రం పూట ఈ బీచ్ కి చాలామంది వస్తుంటారు. స్ట్రీట్ ఫుడ్, లోకల్ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ బీచ్ లో గడిపితే చాలా బాగుంటుంది. ఎలిఫెంటా గుహలు: ఈ గుహలను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. ఇవి ముంబై నుండి కొద్దిగా దూరంలో ఉంటాయి. ఐదవ శతాబ్దానికి చెందిన ఈ కట్టడాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇమాజికా: సాయంత్రం పూట అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్లాలన్న ఆలోచన మీకు ఉంటే ఇమాజికా వెళ్ళండి. ఇక్కడ అన్ని వయసుల వారికి సంబంధించిన థ్రిల్లింగ్ రైడ్స్, వాటర్ గేమ్స్ ఉంటాయి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో వెళ్తే బాగా ఎంజాయ్ చేయవచ్చు.