
పెట్: మీ పెంపుడు కుక్కలను ఇంట్లో ఆడించాలనుకుంటే ఇలా చేయండి
ఈ వార్తాకథనం ఏంటి
పెంపుడు కుక్కపిల్లను బయటకు తీసుకెళ్ళడమే కాదు, ఇంట్లో కూడా ఆడించవచ్చు. ప్రతీసారీ బయటకు తీసుకెళ్ళడమే కాకుండా ఇంట్లో కూడా అప్పుడప్పుడూ ఆడిస్తూ ఉండాలి.
మరి ఇంట్లో ఎలాంటి ఆటలు ఆడించవచ్చనేది ఇక్కడ తెలుసుకుందాం.
టగ్ ఆఫ్ వార్:
ఒకవైపు తాడును మీరు పట్టుకుని మరోవైపు తాడును కుక్క తన నోటితో పట్టుకునేలా చూడండి. ఈ ఆటవల్ల కుక్కపిల్లలకు శారీరకంగానే కాదు మానసికంగానూ ఉపయోగం ఉంటుంది.
చేతులను మార్చే ఆట:
కుక్కపిల్లకు ఇష్టమైన ఆహారాన్ని చేతిలో పట్టుకుని, రెండు చేతులతో పిడికిలి బిగించి, ఆ ఆహారం ఏ చేతిలో ఉందో కనుక్కోమని కుక్కపిల్లకు తెలియజేయండి. కుక్కపిల్ల కనుక్కోగానే ఆ ఆహారాన్ని దానికి అందజేయండి.
Details
ముద్దు చేస్తేనే మానసిక ఆరోగ్యం
ప్యాంపర్ సెషన్:
కుక్కపిల్లలు ముద్దు చేయడాన్ని చాలా ఇష్టపడతాయి. వారంలో ఒక్కసారయినా వాటిని మీరు ముద్దు చేయాలి. దానివల్ల కుక్కపిల్లల మానసిక ఆరోగ్యం బాగుంటుంది.
జంపింగ్:
పెంపుడు జంతువులకు జంపింగ్ నేర్పించాలి. వాటికి అడ్డుగా వచ్చ్చిన వస్తువులపై నుండి దూకేలా శిక్షణ ఇవ్వాలి. టవల్స్ ద్వారా మీరు శిక్షణ ప్రారంభించవచ్చు.
దార్లో ఏదైనా అడ్డుగా ఉంటే వాటిని దాటి ఎలా రావాలో మీరు నేప్రించే జంపింగ్ ద్వారా వాటికి అర్థమవుతుంది. జంపింగ్ వల్ల పెంపుడు జంతువుల శరీరం చురుగ్గా మారుతుంది.
వాసన పసిగట్టే పని:
కుక్కపిల్లలు వాసనను తొందరగా పసిగడతాయి. కాకపోతే ఆ పనిలో పర్ఫెక్ట్ అవ్వాలంటే శిక్షణ అవసరం. ఆటలో భాగంగా వాసనను కనిపెట్టే ఆటలు ఆడితే బాగుంటుంది.