
మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే ఎరువుల్లోని రకాలు
ఈ వార్తాకథనం ఏంటి
మీ ఇంటి పెరట్లో గానీ, మీ చేనులో గానీ మొక్కలు పెంచుతున్నట్లయితే వాటికి పోషకాలు అందించడానికి రకరకాల ఎరువులు జల్లాల్సి ఉంటుంది. ఎరువుల్లో చాలా రకాలున్నాయి.
ప్రస్తుతం వర్షాకాలం వచ్చేస్తోంది కాబట్టి మొక్కల పెంపకాన్ని ఇష్టపడేవారు ఈ ఎరువుల గురించి ఖచ్చితంగా తెలుసుకోండి.
సేంద్రీయ ఎరువులు:
ఈ ఎరువులు కంపోస్ట్, పీట్ నాచు, జంతువుల పేడ, అనేక రకాల ఖనిజాలు మొదలైన వాట్తో తయారవుతాయి. ఇవి పర్యావరణానికి ఎలాంటి హాని కలగజేయవు. ఈ ఎరువుల వల్ల భూమి ఆరోగ్యంగా ఉంటుంది. దానివల్ల మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతాయి.
ఇనార్గానిక్ ఎరువులు:
ఇవి పౌడర్లు, ద్రవాలు, చిన్న చిన్న కణాల రూపంలో ఉంటాయి. వీటిని పెద్ద మొత్తంలో ఇండస్ట్రీలలో తయారు చేస్తారు.
Details
మొక్కలకు బలాన్నిచ్చే వివిధ రకాల ఎరువులు
నైట్రోజన్ ఆధారిత ఎరువులు:
ఈ ఎరువుల్లో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. వర్షాలు పడినపుడు ఇందులోని నైట్రోజన్ అమ్మోనియాగా మారి నీటితో కలిసి మొక్క వేళ్ళకు మంచి బలాన్ని అందిస్తుంది. చిన్న కణికలు, గుళికల రూపంలో ఈ ఎరువులు దొరుకుతాయి.
పొటాషియం ఆధారిత ఎరువులు:
పొటాషియం క్లోరైడ్, పొటాషియం సల్ఫేట్ రసాయనాలుండే ఈ ఎరువులు, మొక్కలకు రోగాలకు రాకుండా చూసుకుంటాయి. కూరగాయలు, పండ్లు, పువ్వులు అందించే మొక్కలకు పొటాషియం ఎరువులు బాగా హెల్ప్ చేస్తాయి.
కంప్లీట్ ఎరువులు:
వీటిల్లో నైట్రోజన్, పొటాషియం, పాస్ఫరస్ సమపాళ్ళలో ఉంటాయి. మొక్కలకు అన్నిరకాల పోషణ అందించడానికి ఈ ఎరువులు ఉపయోగపడతాయి. కణికలు, గుళికల రూపంలో ఎరువుల షాపుల్లో దొరుకుతాయి.