మీకు సలాడ్స్ అంటే ఇష్టమా? ఈ వెరైటీ సలాడ్స్ ఒకసారి ట్రై చేయండి
ఒకప్పుడు సలాడ్స్ సైడ్ డిష్ గా ఉండేవి. కానీ ఇప్పుడు ప్రధాన ఆహారంగా మారిపోయింది. రంగు రంగుల కలర్లు, మంచి మంచి సువాసనలు సలాడ్స్ ని ప్రధాన ఆహారంగా మార్చేశాయి. ప్రస్తుతం మీ నోటికి రుచి అందించి ఆకలిని తీర్చే కొన్ని సలాడ్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. గ్రీక్ సలాడ్: ఆలివ్, క్యాప్సికం, దోసకాయ, టమాట, ఉల్లిపాయలు ఫెటా చీజ్ కలిపి గ్రీక్ సలాడ్ ని తయారు చేస్తారు. ఈ సలాడ్ లో ఆలివ్ ఆయిల్, ఒరేగానో, ఇంకా నిమ్మరసం కలుపుకుని తింటే. బాగుంటుంది సాధారణంగా వేసవికాలం మధ్యాహ్న సమయాల్లో ఈ సలాడ్ ని ఎక్కువగా తాగుతారు.
గ్రీన్ క్యాబేజ్ ఖచ్చితంగా ఉండే సలాడ్
కోల్ స్లా(coleslaw) ఈ సలాడ్ లో గ్రీన్ క్యాబేజ్, వెనిగర్, చక్కెర, ఉప్పు, మిరియాల పొడి ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు వేరే ఇతర పదార్థాలు కూడా ఉంటాయి. కాకపోతే క్యాబేజీ మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఈ సలాడ్ ని ఆకర్షణీయంగా మార్చేందుకు క్యారెట్ కూడా చేర్చుతారు. ఫ్రూట్ సలాడ్: ఈ సలాడ్ లో రకరకాల పండ్లు కనిపిస్తాయి. ఆయా ఋతువును బట్టి పండ్లు ఇందులో ఉంటాయి. మామిడి, అరటి, ద్రాక్ష, దానిమ్మ, జామ ఇలా రకరకాల పండ్లతో దీన్ని తయారు చేస్తారు. ఈ సలాడ్ ని మరింత రుచికరంగా మార్చడానికి కొంచెం తేనె, కొన్ని పుదీనా ఆకులు, కొంత దాల్చిన చెక్క పొడి కలుపుతారు.
పాలకూర ప్రధానంగా ఉండే సలాడ్
పాస్తా సలాడ్: ఈ సలాడ్ లో టమాటా, స్వీట్ పెప్పర్, బేబీ కార్న్, ఇంకా ఇతర కూరగాయలు ఉంటాయి. ఫెటా ఛీజ్, ఆలివ్ మొదలగునవి అదనంగా కలుపుకోవచ్చు. కొంతమంది దీనిలో శనగలు కూడా కలుపుకుంటారు. సీజర్ సలాడ్(Caesar Salaad): ఈ సలాడ్ లో ప్రధాన ఆహార పదార్థంగా పాలకూర ఉంటుంది. ఇంకా టమాట, టోఫు, శనగలు ఉంటాయి. ఈ రకం సలాడ్ ని 1920లో తయారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సలాడ్ అన్ని దేశాల్లోనూ లభిస్తుంది.