
Ugadi Decoration Ideas: ఉగాదికి ఇంటిని అలంకరించుకునే డెకరేషన్ ఐడియాలు.. మీ కోసం..
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు ప్రజల నూతన సంవత్సరోత్సవం ఉగాది. ఈ ఏడాది మార్చి 30, ఆదివారం రోజున ఉగాది పండుగ వచ్చింది.
అయితే ఉగాది అంటే కేవలం పచ్చడి తినడం మాత్రమే కాదు, మారుతున్న కాలానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేయడం కూడా.
పండుగ వస్తుందంటే ఇంటిని అందంగా అలంకరించేందుకు కొత్త కొత్త ఆలోచనలు చేయడం సహజం. ఈసారి మీ కోసం ఉత్తమమైన డెకరేషన్ ఐడియాలు అందిస్తున్నాం.
వివరాలు
అరటి ఆకుల అలంకరణ
ప్రస్తుతం అరటి ఆకులతో విభిన్న రకాల డెకరేషన్లు చేస్తున్నారు. మీ పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచేందుకు ఇంటి ప్రవేశ ద్వారం ముందు అరటి ఆకులు, చెట్లు అమర్చండి. ఇవి మన సంప్రదాయాన్ని ఆవిష్కారించడమే కాకుండా ఇంటికి హరిత వాతావరణాన్ని కలిగిస్తాయి.
పూల అలంకరణ
తాజా పూలను ఉపయోగించి ఇంటిని మరింత అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇంటి ప్రధాన ద్వారం, పూజా గది చుట్టూ పూల తోరణాలు కట్టండి. అలాగే, ఇంటి మధ్యలో పువ్వులతో అద్భుతమైన ముగ్గులు వేసుకోవచ్చు. వీటి వల్ల ఇల్లు మరింత శోభాయమానంగా మారుతుంది. రాత్రివేళలలో పూలతోరణాలకు లైటింగ్ జోడిస్తే, వాటి అందం రెట్టింపు అవుతుంది.
వివరాలు
శోభాయమానంగా మామిడి తోరణాలు
ఇంటి ప్రధాన ద్వారాన్ని మామిడి ఆకుల తోరణాలతో అలంకరించండి. ఇది చూసే వారిలో పండుగ ఉల్లాసాన్ని పెంచి, ఇంటికి కొత్త కళను తీసుకొస్తుంది.
రంగుల ముగ్గులు
ఇంటి ముందు రంగులతో, అద్భుతమైన ముగ్గును వెయ్యండి. ఈ ముగ్గు ఇంటికి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చే ముఖ్యమైన భాగం. మరింత ప్రత్యేకంగా కనిపించాలంటే, మామిడి కాయలు, చిలుకల థీమ్‌తో ముగ్గును అలంకరించండి. ఇది మీ ఇంటికి అదనపు ఆకర్షణను అందిస్తుంది.