LOADING...
Valentines Day 2026: వాలెంటైన్స్ డే స్పెషల్.. ఈ బహుమతులు ఇస్తే బంధం ముక్కలయ్యే ఛాన్స్!
వాలెంటైన్స్ డే స్పెషల్.. ఈ బహుమతులు ఇస్తే బంధం ముక్కలయ్యే ఛాన్స్!

Valentines Day 2026: వాలెంటైన్స్ డే స్పెషల్.. ఈ బహుమతులు ఇస్తే బంధం ముక్కలయ్యే ఛాన్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 08, 2026
11:11 am

ఈ వార్తాకథనం ఏంటి

వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులు ఒకరికి ఒకరు బహుమతులు ఇచ్చుకోవడం సహజం. అయితే పొరపాటున తప్పుడు గిఫ్ట్‌ను ఎంచుకుంటే, అదే ప్రేమ బంధంలో చీలికలకు కారణమయ్యే ప్రమాదం ఉందని కొందరు నమ్ముతారు. కొన్ని వస్తువులు ప్రతికూల శక్తిని (Negative Energy) ఆకర్షిస్తాయని, మరికొన్ని విడిపోవడానికి సంకేతాలుగా భావిస్తారు. ఉదాహరణకు, గడియారం బహుమతిగా ఇస్తే ప్రేమకు కాలం చెల్లిపోతుందని, అద్దాలు ఇస్తే మనస్పర్థలు పెరుగుతాయని విశ్వాసం ఉంది. అలాంటి అశుభకరమైన బహుమతులు, వాటి వెనుక ఉన్న గూఢార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Details

అశుభకరమైనవి, ప్రతికూల సంకేతాలుగా భావించే బహుమతులు

ప్రేమకు ఎర్ర గులాబీ ప్రతీకగా భావిస్తారు. అయితే నల్ల రంగు వస్తువులు లేదా నల్ల గులాబీలను బహుమతిగా ఇవ్వడం మంచిది కాదని చెబుతారు. నలుపు రంగును దుఃఖానికి సంకేతంగా భావిస్తారు. అలాగే పర్సులు, బ్యాగులు, తోలుతో చేసిన వస్తువులు బహుమతిగా ఇస్తే ఆర్థిక సమస్యలతో పాటు సంబంధాల్లో గొడవలు వచ్చే అవకాశముందని కొందరి నమ్మకం. అద్దాలను బహుమతిగా ఇవ్వడం వల్ల వాటిలో కనిపించే ప్రతిబింబం ప్రతికూల శక్తిని రెట్టింపు చేస్తుందని, దాంతో దంపతుల మధ్య ఎప్పుడూ కలహాలు జరుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

Details

సంబంధం తెగిపోయే సూచనలుగా భావించే గిఫ్టులు

వాస్తు శాస్త్రం ప్రకారం, ఎవరికైనా వాచ్ లేదా గడియారం ఇవ్వడం అంటే వారి కాలాన్ని మనం బహుమతిగా ఇచ్చినట్టే. ఇది ఆ సంబంధం ముగింపు దశకు చేరుకుంటుందనే సంకేతంగా భావిస్తారు. అలాగే మొక్కలను బహుమతిగా ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. ముఖ్యంగా కాక్టస్ వంటి ముళ్లు ఉన్న మొక్కలను ఎప్పుడూ గిఫ్ట్‌గా ఇవ్వకూడదు. ముళ్లు ఉన్న మొక్కలు బంధంలో చేదు భావాలను, గొడవలను పెంచుతాయని నమ్మకం. పదునైన వస్తువులు, కత్తులు, కత్తెరలు వంటివి బహుమతిగా ఇస్తే ప్రేమ బంధాన్ని తెంచే ప్రమాదం ఉందని పురాణాలు సూచిస్తున్నాయి.

Advertisement

Details

పువ్వుల పేర్లతో పిల్లలకు నామకరణం

బహుమతుల విషయం పక్కన పెడితే, ప్రేమకు గుర్తుగా పుట్టే పిల్లలకు పువ్వుల పేర్లు పెట్టాలని చాలామంది కోరుకుంటారు. పువ్వుల పేర్లు స్వచ్ఛత, సౌందర్యానికి ప్రతీకలుగా భావిస్తారు. రోజా, మల్లె, లిల్లీ, కమలం వంటి పేర్లు పిల్లలకు సానుకూల శక్తిని అందిస్తాయని నమ్మకం ఉంది. గిఫ్టులకన్నా ప్రేమ బంధాన్ని మనసుతో కాపాడుకోవడమే ముఖ్యమైనది. అయితే ఇలాంటి శాస్త్రాలు, నమ్మకాలను దృష్టిలో పెట్టుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని పలువురు విశ్వసిస్తారు.

Advertisement