Valentine's Day Wishes: వాలెంటైన్స్ డే స్పెషల్.. హృదయాన్ని హత్తుకునే కవితలివే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రేమికుల దినోత్సవం సమీపిస్తోంది. మీరు మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు చెప్పేందుకు రెడీనా? ఏ గిఫ్ట్ ఇచ్చినా సరే, ఒక ప్రత్యేకమైన మెసేజ్ లేకుంటే అది అసంపూర్ణంగా ఉంటుంది.
అందుకే మీ ప్రేమను అద్భుతంగా వ్యక్తపరిచే కవితలను మీ ముందుంచుతున్నాం.
ఈ కవితలను మీ మెసేజ్‌లో జత చేసి పంపించి, మీ ప్రేయసి లేదా ప్రియుడి మనసు గెలుచుకోండి.
1. గాలిబ్ కవిత అనువాదం
ఎవరూ లేని ప్రదేశంలో ఏకాంతంగా ప్రయాణిద్దాం,
గోడలు లేని ఇంట్లో, తలుపులేని మనసులతో తీయటి మాటలు చెప్పుకుందాం.
కాపలా ఎవరూ వద్దు, పొరుగువారితో పనిలేదు.
జబ్బు వచ్చినా పట్టించుకునే వాడెవ్వరు, కానీ, ప్రాణం పోయిందని దిగులు చెందే మనిషే అవసరం లేకుండా బతికేద్దాం.
Details
2. నీ ప్రేమలో మత్తు
మద్యం ఇవ్వలేని మత్తు నీ ప్రేమలో చూశా,
పద్యం పలకలేని భావం నీ కళ్లలో చూశా.
సేద్యం తెలియని నా మనసులో నీ గురించి కొత్త కలలను చూశా.
హ్యాపీ వాలెంటైన్స్ డే మై లవ్!
3. నువ్వు లేకుండా
నువ్వు లేక నవ్వలేను,
నువ్వు లేక తినలేను.
నువ్వు లేక పలకలేను,
నువ్వు లేక బతకలేను.
ఒక్కసారి సమ్మతించు,
ఈ జన్మంతా నీకు దాసుడినై పోతా!
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ప్రియా!
4. నీ కోసం కలలు
నీ కోసం ఎదురుచూడటమే తప్పు,
నీతో కలిసి కలలు కనడమే తప్పు.
ఇవన్నీ అబద్ధాలైతే బాగుండు,
ఈ సమస్యలేమీ మన మధ్య రాకూడదు.
హ్యాపీ వాలెంటైన్స్ డే మై లవ్!
Details
5. నీ సమీపమే స్వర్గం
నీ వియోగమే నరకం,
నీ సమీపమే సువాసన భరితం.
జన్మజన్మల నా ప్రేమ నీ సొంతం,
అడిగితే ఇచ్చినా నా తనువును ఆసాంతం.
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ప్రియతమా!
6. నా మౌనం, నా ప్రేమ
నా చూపులను తప్పించుకోవచ్చు,
నా మాటలతో భ్రమ కలిగించవచ్చు.
ఇప్పటికి మౌనంగా ఊరుకోవచ్చు,
కానీ రేపటికి కాదు!
హ్యాపీ వాలెంటైన్స్ డే మై లవ్!
Details
7. ప్రతి క్షణం నీకోసం
పున్నమి రాత్రి వెన్నెల వెలుగుల్లో,
నిశి రాత్రి చీకట్లలో,
మిట్ట మధ్యాహ్నపు వెలుగుల్లో,
సంధ్యా సమయపు కిరణాల్లో... క్షణమేదైనా... ధ్యాసంతా నీ మీదనే,
చోటేదైనా... ప్రేమంతా నీ కోసమే!
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ప్రియా!
8. నా కోసం ఒక మనిషి
ప్రపంచంలో ఒక్క మనిషి నా కోసం ఉండాలి,
నువ్వే ఆ మనిషి కావాలి!
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ప్రియతమా!
9. నీతో ప్రతి క్షణం
ప్రతి క్షణం నీతో ఉండాలి,
ప్రతి క్షణంలో నువ్వుండాలి!
హ్యాపీ వాలెంటైన్స్ డే మై లవ్!