వాలెంటైన్స్ డే: 2023లో మంచి జంటగా నిలిచే రాశుల కాంబినేషన్ తెలుసుకోండి
ప్రేమికుల రోజు దగ్గర పడుతున్న కొద్దీ తమ బంధాన్ని మరింత దృఢం చేసుకోవడానికి లేదా మరో మెట్టు ఎక్కించడానికి అందరూ రెడీ అవుతున్నారు. మీరూ కూడా అదే పనిలో ఉంటే, ఏ రాశుల వారికి ఏ రాశి వారితో మంచి సంబంధం కుదురుతుందో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వినయ్ అరోరా తెలియజేస్తున్నారు. వృషభం, కర్కాటకం: వృషభ రాశి గల వారి జాతకచక్రంలో గురుడు 11వ ఇంటిలో ఉంటున్నాడు. దానివల్ల 3వ ఇల్లు, 5వ ఇల్లు(ప్రేమ), 7వ ఇల్లు(పెళ్ళి) మీద ప్రభావం ఉంటుంది. ఇక కర్కాటకంలో భాగ్య భవనంలో ఉంటున్న గురుడు 3వ, 5వ ఇంటివైపు చూస్తున్నాడు. కాబట్టి ఈ రెండు రాశులు మంచి జంటలుగా మారే అవకాశం ఎక్కువ.
ఏయే రాశుల వారికి ఏయే రాశులతో సంబంధం కుదురుతుందో తెలియజేస్తున్న వినయ్ అరోరా
సింహ, ధనుస్సు: ఈ రెండూ కూడా అగ్నికి సంబంధించిన రాశులే, వీరి మధ్య ఎనర్జీ, బంధం చాలా గట్టిగా ఉంటుంది. ధనుస్సు రాశి వాళ్ళు ఎక్కువగా వాళ్ళ సహోద్యోగులను, క్లాస్ మేట్స్ ని పెళ్ళి చేసుకునే అవకాశం ఎక్కువ. కుంభ రాశి, తుల రాశి: కుంభరాశి వారిలో 1వ ఇంటిలో ఉన్న శని, 3వ, 7వ, 10వ ఇంటివైపు చూడటం లేదు. 7వ ఇల్లు పెళ్ళికి సంబంధించినది. ఇక తుల విషయానికి వస్తే 6వ ఇంటిలో ఉన్న గురుడు 12వ ఇంటివైపు చూస్తున్నాడు. దీనివల్ల ఈ రాశుల వారు పెళ్ళి చేసుకుంటే మంచి బంధం కాగలుగుతారు. మిధున రాశి, కుంభరాశి, అలాగే వృశ్చికం, మీనం రాశుల వారి మధ్య మంచి బంధం కుదురుతుంది.