Valentine's Week 2025: వాలెంటైన్స్ వీక్ పూర్తి డేట్‌షీట్.. మీ కోసమే.. ఏ రోజును ఎలా జరుపుకోవాలో తెలుసుకోండి..
ఈ వార్తాకథనం ఏంటి
ఫిబ్రవరి నెల ప్రేమికులకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ నెలలో ప్రేమను వ్యక్తం చేసేందుకు అనేక ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి.
వాస్తవానికి, ఫిబ్రవరి నెలలో ఒక వారం రోజుల పాటు ప్రేమికులకు పరీక్షలే జరుగుతాయి.
ప్రియమైన వ్యక్తి మనసు గెలుచుకోవాలంటే ఈ పరీక్షల్లో విజయాన్ని సాధించాల్సిందే.
ఈ ప్రేమ పరీక్షలో ఉత్తీర్ణులైన జంటలకు వారి ప్రేమ, సంతోషం బహుమతిగా లభిస్తాయి.
ఇప్పటికే చాలా మంది ప్రేమికులు ఈ ప్రత్యేకమైన వారం కోసం సన్నద్ధమవుతున్నారు. మరి, మీరు సిద్ధంగా ఉన్నారా?
వివరాలు
ప్రత్యేకమైన వారంలో రోజుకో ప్రత్యేకమైన అర్థం
మీరు ఇంకా ఏమీ ప్రారంభించకపోతే, ఇదే సరైన సమయం! ప్రేమికులు ఏడుదినాల పాటు జరుపుకునే ఈ ప్రత్యేకమైన వారం వాలెంటైన్ వీక్ గా పిలువబడుతుంది.
ఈ ప్రత్యేకమైన వారంలో రోజుకో ప్రత్యేకమైన అర్థంతో జరుపుకునే రోజులు ఉన్నాయి.
మీరు కూడా ఈ వారం సులభంగా ఆనందించి, ప్రేమను గెలుచుకొండి. ఇక్కడ వాలెంటైన్ వీక్ పూర్తి షెడ్యూల్ అందించాం.
ఈ వారం ఏ రోజును ఎలా జరుపుకోవాలో తెలుసుకొండి.
వివరాలు
వాలెంటైన్ వీక్ షెడ్యూల్
రోజ్ డే (Rose Day) - ఫిబ్రవరి 7
వాలెంటైన్ వీక్ పుష్పాలతో మొదలవుతుంది. ప్రేమికులు ఫిబ్రవరి 7న రోజ్ డే ని జరుపుకుంటారు. ఈ రోజున ప్రేమను వ్యక్తపరచేందుకు గులాబీ పూలను బహుమతిగా ఇచ్చుకుంటారు. గులాబీల వాసన, అందం ప్రేమలో మరింత మాధుర్యాన్ని తీసుకువస్తుందనేది నమ్మకం.
ప్రపోజ్ డే (Propose Day) - ఫిబ్రవరి 8
మీరు మీ మనసులోని వ్యక్తికి మీ ప్రేమను చెప్పడానికి ఇది ఉత్తమమైన రోజు. ఈ రోజున, మీ క్రష్‌ను ముచ్చటైన బహుమతితో సంతోషపెట్టండి మరియు మీ ప్రేమను ధైర్యంగా వ్యక్తపరచండి.
వివరాలు
వాలెంటైన్ వీక్ షెడ్యూల్
చాక్లెట్ డే (Chocolate Day) - ఫిబ్రవరి 9
ప్రేమను మధురంగా మార్చే రోజు చాక్లెట్ డే! ఈ రోజున జంటలు ఒకరికొకరు చాక్లెట్లు ఇచ్చుకుంటారు. చాక్లెట్ల తీపిని ప్రేమ సంబంధంలో ఆనందంగా నింపే రోజు ఇది.
టెడ్డీ డే (Teddy Day) - ఫిబ్రవరి 10
ఈ రోజున ప్రేమను ప్రతిబింబించే అందమైన టెడ్డీ బేర్‌ను బహుమతిగా ఇవ్వడం పరిపాటి. ముఖ్యంగా అమ్మాయిలకు టెడ్డీలంటే ఎంతో ఇష్టం. కాబట్టి మీ ప్రియమైనవారికి ప్రేమను వ్యక్తం చేసేందుకు ఈ రోజును వినియోగించుకోండి.
వివరాలు
వాలెంటైన్ వీక్ షెడ్యూల్
ప్రామిస్ డే (Promise Day) - ఫిబ్రవరి 11
ప్రేమలో సుదీర్ఘబంధం కోసం వాగ్దానాలు ఇచ్చుకునే రోజు ప్రామిస్ డే.ఈరోజున ప్రేమికులు ఒకరికొకరు జీవితాంతం ప్రేమను నిబద్ధంగా కొనసాగిస్తామని హామీ ఇస్తారు.
హగ్ డే (Hug Day) - ఫిబ్రవరి 12
గుండెల్లో హత్తుకోవడం అనేక భావోద్వేగాలను వ్యక్తపరచే మధురమైన చర్య.ప్రేమికులు తమ భాగస్వాములను హత్తుకుని తమ ప్రేమను పంచుకునే రోజు హగ్ డే.శాస్త్రీయంగా కూడా హత్తుకోవడం మనసు ప్రశాంతతను కలిగించుతుందని నమ్ముతారు.
కిస్ డే (Kiss Day) - ఫిబ్రవరి 13
ప్రేమ,ఆప్యాయతకు ప్రతీక కిస్ డే.ఈరోజు భాగస్వాములకు తమ ప్రేమను మరింత గాఢంగా వ్యక్తపరచే అవకాశం.ముద్దు అనేది ప్రేమను బలోపేతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
వివరాలు
వాలెంటైన్ వీక్ షెడ్యూల్
వాలెంటైన్స్ డే (Valentine's Day) - ఫిబ్రవరి 14
ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు అత్యంత ప్రత్యేకంగా జరుపుకునే రోజు. ప్రేమను వ్యక్తపరచడం, ప్రత్యేక బహుమతులు ఇచ్చుకోవడం, సమయాన్ని విలువైనదిగా మార్చుకోవడం—ఇవి అన్నీ ఈ రోజు జరగడం ఆనవాయితీ. ప్రేమికులకు ఇదొక అద్భుతమైన రోజు.