LOADING...
Valentine's Week Special: వాలంటైన్ వీక్ స్పెషల్‌.. ప్రేమ వెనుక ఉన్న ఈ ఆశ్చర్యకర నిజాలు తెలుసా?
వాలంటైన్ వీక్ స్పెషల్‌.. ప్రేమ వెనుక ఉన్న ఈ ఆశ్చర్యకర నిజాలు తెలుసా?

Valentine's Week Special: వాలంటైన్ వీక్ స్పెషల్‌.. ప్రేమ వెనుక ఉన్న ఈ ఆశ్చర్యకర నిజాలు తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 10, 2026
01:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫిబ్రవరి నెల వచ్చిందంటే ప్రేమికుల హృదయాల్లో ప్రత్యేకమైన ఉత్సాహం మొదలవుతుంది. వాలెంటైన్స్‌ డే కోసం ఎదురు చూస్తూ, ఒకరిపై ఒకరు తమ ప్రేమను వ్యక్తపరుచుకునేందుకు సిద్ధమవుతారు. గులాబీ పూలు, గ్రీటింగ్ కార్డులు, చాక్లెట్లు, ఆభరణాలు వంటి కానుకలతో ప్రేమను చాటుకుంటారు. ఈ సందర్భంగా జరిగే వ్యాపారం కూడా కోట్లలోనే ఉంటుంది. గత ఏడాది ఒక్క అమెరికాలోనే వాలంటైన్స్‌ డే సందర్భంగా సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన కొనుగోళ్లు జరిగాయని అంచనా. భారత్‌లో ఈ మొత్తం రూ.25 వేల కోట్లకు పైగా ఉంటుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

Details

వాలంటైన్ వీక్‌లోని ప్రతి రోజు ప్రత్యేకత ఇదే..

ఫిబ్రవరి 7- రోజ్ డే: గులాబీ పూలు ఇచ్చి ప్రేమను వ్యక్తపరచే రోజు. ఫిబ్రవరి 8 - ప్రపోజ్ డే: మనసులోని భావాలను ప్రియుడు లేదా ప్రియురాలికి చెప్పే సందర్భం. ఫిబ్రవరి 9- చాక్లెట్ డే: తీపి జ్ఞాపకాలను చాక్లెట్ల రూపంలో పంచుకునే రోజు. ఫిబ్రవరి 10- టెడ్డీ డే: అందమైన టెడ్డీ బేర్లను గిఫ్ట్‌గా ఇచ్చే రోజు. ఫిబ్రవరి 11- ప్రామిస్ డే: జీవితాంతం తోడుగా ఉంటామని హామీ ఇచ్చుకునే రోజు. ఫిబ్రవరి 12 - హగ్ డే: ప్రేమతో ఆలింగనం చేసుకునే రోజు. ఫిబ్రవరి 13 - కిస్ డే: ముద్దుతో ప్రేమ బంధాన్ని మరింత బలపరిచే రోజు. ఫిబ్రవరి 14 - వాలంటైన్స్ డే.. ప్రేమికుల ప్రత్యేక దినం.

Details

గ్రీటింగ్ కార్డులే రూ.20 కోట్ల వ్యాపారం!

వాలంటైన్స్‌ డే రోజున ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల గ్రీటింగ్ కార్డులు అమ్ముడవుతాయి. ప్రేమను వ్యక్తపరచేందుకు మనుషులే కాదు.. కొన్ని జీవులు కూడా కానుకలతోనే తమ భావాలను చాటుకుంటాయి. మగ పెంగ్విన్లు తమ జంట కోసం సముద్రతీరమంతా వెతికి నున్నటి రాళ్లను తీసుకొచ్చి బహుమతిగా ఇస్తాయి. ప్రేమికుల రోజు కానుకగా సుమారు 20 శాతం మంది ఆభరణాలను ఇష్టపడతారని సర్వేలు చెబుతున్నాయి. ప్రేమకు చిహ్నంగా ఎక్కువగా ఇచ్చుకునే పువ్వు గులాబీనే. ఒక్క రోజే దాదాపు 25 కోట్ల గులాబీ పూలు చేతులు మారుతాయి. అలాగే ఏటా ఫిబ్రవరి 14న చాక్లెట్ బాక్సులు సుమారు నాలుగు కోట్ల వరకు కొనుగోలు చేస్తారట.

Advertisement

Details

పర్యాటకులు దేశవిదేశాల నుంచి ఇక్కడికి వస్తుంటారు

సముద్రంలోని డాల్ఫిన్లు ఒకదాన్నొకటి ప్రత్యేకమైన శబ్దాలతో పిలుచుకుంటాయి. ఇది ప్రేమికులు ముద్దుపేర్లతో పిలుచుకునే విధానాన్ని తలపిస్తుంది. రాజస్థాన్‌లోని బింజౌర్ ప్రాంతంలో లైలా-మజ్నూ మజార్ ఉంది. ఇండో-పాక్ సరిహద్దుల్లో ఉన్న ఈ దర్గా అమర ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ఏటా ఇక్కడ ప్రేమికుల జ్ఞాపకార్థం వేడుకలు జరుగుతుంటాయి. పర్యాటకులు దేశవిదేశాల నుంచి ఇక్కడికి వస్తుంటారు.

Advertisement

Details

ప్రేమను చూస్తే కళ్లలో మార్పు.. గుండెల్లో ఒకే లయ!

'లవ్‌బర్డ్స్' అనే పదం ఆఫ్రికాలో కనిపించే ఫిషర్ లవ్‌బర్డ్ చిలుకల నుంచి వచ్చింది. ఇవి జీవితాంతం తమ జంటతోనే కలిసి ఉంటాయి. ఒకదానికొకటి ప్రేమగా తినిపించుకోవడం కూడా వీటి ప్రత్యేకత. సముద్ర జీవులైన సీ ఓటర్స్, సీహార్స్‌లు నిద్రలోనూ, ప్రయాణాల్లోనూ తమ జంటను వదలవు. శాస్త్రవేత్తల ప్రకారం, మనం ప్రేమించిన వ్యక్తిని చూసినప్పుడు కంటిపాప పరిమాణం సుమారు 45 శాతం వరకు పెరుగుతుంది. ప్రేమికులు ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటే, వారి గుండె స్పందన కూడా ఒకే లయలో ఉండటం విశేషం.

Details

ప్రేమలో హార్మోన్ల పాత్ర

'ఐ లవ్ యూ' అంటూ ప్రేమను వ్యక్తపరచడంలో అమ్మాయిలే ముందుంటారని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రేమ కూడా ఆహారం, నిద్రలాగే మనిషికి అవసరమైన భావమే. ప్రేమలో పడినప్పుడు ఆక్సిటోసిన్, డోపమైన్ అనే హార్మోన్లు విడుదలై ఆనందాన్ని పెంచి, ఒత్తిడిని తగ్గిస్తాయి. లవ్ హార్మోన్‌గా పిలిచే ఆక్సిటోసిన్‌కు మతిమరుపు తగ్గించడం, నొప్పిని నియంత్రించడం వంటి గుణాలున్నాయని పరిశోధనలు వెల్లడించాయి. జపాన్‌లో ఫిబ్రవరి 14న అమ్మాయిలు అబ్బాయిలకు చాక్లెట్లు ఇచ్చి ప్రేమను వ్యక్తపరుస్తే, మార్చి 14న అబ్బాయిలు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేస్తారు. ఇష్టమైన వ్యక్తి దూరమైతే 'హార్ట్ బ్రేక్' అనే మాట నిజమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తీవ్రమైన భావోద్వేగ సమయంలో విడుదలయ్యే కొన్ని రసాయనాలు గుండెను బలహీనపరచి ప్రమాదకర పరిస్థితులకు కూడా దారితీయవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.

Advertisement