Valentines Day 2026: వాలెంటైన్స్ వీకెండ్ స్పెషల్.. ప్రేమికులకు పర్ఫెక్ట్‌గా సరిపోయే 5 రొమాంటిక్ డెస్టినేషన్స్ ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
వాలెంటైన్స్ డే అనేది ఇద్దరి మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని సంబరంగా జరుపుకునే ప్రత్యేక రోజు. ఈసారి 2026 ఫిబ్రవరి 14 శనివారం రావడంతో, సెలవుల గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేకుండా చిన్నపాటి విహారయాత్రను సులువుగా ప్లాన్ చేసుకునే అవకాశం దొరికింది. కొందరు ముందుగానే బుకింగ్స్ పూర్తి చేసి సిద్ధంగా ఉంటే, మరికొందరు చివరి నిమిషం వరకు ప్లాన్‌ను వాయిదా వేస్తుంటారు. మీరు కూడా ఆ 'లాస్ట్ మినిట్' లిస్ట్‌లో ఉంటే, మీ భాగస్వామితో కలిసి ఏకాంతంగా గడపడానికి రొటీన్‌కు భిన్నంగా ఉండే కొన్ని ప్రత్యేక ప్రదేశాలు ఇవే. ప్రేమలో మునిగి తేలాలనుకునే జంటలకు కేరళలోని వాయనాడ్ నిజంగా ఒక స్వర్గధామంలా ఉంటుంది.
Details
సాహస యాత్రలను ఇష్టపడే జంటలకు హావ్ లాక్ ఐలాండ్ చక్కటి గమ్యం
దట్టమైన అడవులు, ఎత్తైన కొండల మధ్య ఉన్న అందమైన రిసార్టులు మీ వీకెండ్‌ను మరింత రంగులమయం చేస్తాయి. ప్రశాంత వాతావరణంలో భాగస్వామితో గడిపే సమయం మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతుంది. కాస్త విభిన్నంగా అనిపించే ప్రదేశం కావాలంటే కర్ణాటకలోని కూర్గ్ ఉత్తమ ఎంపిక. విస్తారమైన కాఫీ తోటలు, ఎత్తైన కొండల మధ్య జలపాతాల హోరు మీ ప్రయాణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక్కడ భాగస్వామితో గడిపే ప్రతి క్షణం మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది. సముద్రతీరం, సాహస యాత్రలను ఇష్టపడే జంటలకు అండమాన్‌లోని హావ్ లాక్ ఐలాండ్ చక్కటి గమ్యం. తెల్లని ఇసుక తిన్నెలు, నీలి సముద్రం మధ్య స్కూబా డైవింగ్ వంటి యాక్టివిటీలతో మీ ట్రిప్‌కు గ్రాండ్ లుక్ వస్తుంది.
Details
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సరైన ప్రదేశం
ఇక మంచుతో కూడిన వాతావరణంలో 'వైట్ వాలెంటైన్స్ డే'ను సెలబ్రేట్ చేయాలనుకునే వారికి అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సరైన ప్రదేశం. మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలు, నిశ్శబ్దంగా ఉండే లోయలు ప్రేమికులకు కొత్త అనుభూతిని అందిస్తాయి. అలాగే హడావుడి లేకుండా హిమాలయాల సహజ అందాలను ఆస్వాదించాలనుకుంటే ఉత్తరాఖండ్‌లోని కౌసానికి వెళ్లొచ్చు. సముద్ర మట్టానికి సుమారు 1,900 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ చిన్న పట్టణం నుంచి నందాదేవి శిఖరాలను దర్శించడం ఓ గొప్ప అనుభూతిగా నిలుస్తుంది. ఈ ఐదు ప్రదేశాల్లో ఏదైనా ఒకదాన్ని ఎంచుకుని, ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా మీ భాగస్వామికి జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన సర్‌ప్రైజ్ ఇవ్వండి.