Page Loader
Valentines Week Recipe: వాలెంటైన్స్ రోజున మీ భాగస్వామిని ఈ రెసిపీతో ఇంప్రెస్ చేయండి ఇలా.. 

Valentines Week Recipe: వాలెంటైన్స్ రోజున మీ భాగస్వామిని ఈ రెసిపీతో ఇంప్రెస్ చేయండి ఇలా.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 04, 2025
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫిబ్రవరి 7 నుండి ప్రారంభమయ్యే వాలెంటైన్ వీక్, ఫిబ్రవరి 14న వాలెంటైన్ డేతో ముగుస్తుంది. ఈ ప్రేమ వారంలో రోజ్ డే, టెడ్డీ డే, చాకొలెట్ డే వంటి విశేషమైన రోజులు ఉంటాయి. ఈ సమయంలో ప్రేమికులు, జీవిత భాగస్వాములు ఒకరికొకరు ప్రత్యేకంగా అనిపించేలా సర్‌ప్రైజ్‌లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. మీరు కూడా మీ ప్రియుడు/ప్రియురాలిని ఆకట్టుకోవాలని అనుకుంటే, ముఖ్యంగా వారు చాకొలెట్ ప్రేమికులైతే, ఈ రెసిపీ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మీ వాలెంటైన్‌ను సంతోషపెట్టేందుకు ఈ స్వీట్ సర్‌ప్రైజ్‌ను స్వయంగా తయారు చేసి గిఫ్ట్ ఇస్తే, వారిని ఎంతగానో ప్రభావితం చేయవచ్చు.

వివరాలు 

హోమ్‌మేడ్ చాకొలెట్ రెసిపీ 

కావాల్సిన పదార్థాలు: 1 కప్పు చక్కెర పొడి, ½ కప్పు కోకో పౌడర్, ½ టీస్పూన్ కాఫీ పౌడర్, ¼ కప్పు మిల్క్ పౌడర్, ½ కప్పు వెన్న లేదా కొబ్బరి నూనె, 1 టీస్పూన్ వెనీలా ఎస్సెన్స్, మీకు నచ్చినంత డ్రై ఫ్రూట్స్, 2 టీస్పూన్లు నెయ్యి తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని దాని మీద జల్లెడ పెట్టి,అందులో చక్కెరపొడిని వేయండి. దీనిలో కోకోపౌడర్,కాఫీపొడి,మిల్క్ పౌడర్ వేసి బాగా కలపండి. ఈపొడులను సరిగ్గా కలిపి పక్కన పెట్టండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి,అందులో సగం నీటిని పోసి మరిగించండి. మరుగుతున్న నీటి మీద వెడల్పాటి గాజుగిన్నె ఉంచి,అందులో వెన్న లేదా కొబ్బరి నూనె వేసి వేడి చేయండి.

వివరాలు 

తయారీ విధానం: 

వెన్న కరిగిన తర్వాత,ముందుగా కలిపిన చాకొలెట్ పొడి మిశ్రమాన్ని అందులో వేసి,చిన్న మంట మీద పెట్టి పిండిని గడ్డలు కట్టకుండా ఉండేలా బాగా కలుపుతూ ఉండాలి. దాదాపు 20-30 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా కలిపితే, చక్కెర పూర్తిగా కరిగి చాకొలెట్ మిశ్రమం తయారవుతుంది. స్టవ్ ఆఫ్ చేసి,వెనీలా ఎస్సెన్స్ జోడించి కలపండి. ఈ మిశ్రమాన్ని చాకొలెట్ మౌల్డ్స్‌లో పోసి, నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్‌ను చేర్చండి (ఇష్టమైతే). మౌల్డ్స్‌ను ఫ్రిజ్‌లో పెట్టి కనీసం 2 గంటల పాటు ఉంచండి.అంతే, రుచికరమైన హోమ్‌మేడ్ చాకొలెట్స్ రెడీ! ఈ ప్రేమవారంలో మీ ప్రేమను వ్యక్తపరిచేందుకు, మీ ప్రియమైన వ్యక్తిని సంతోషపెట్టేందుకు ఈ రెసిపీ ఖచ్చితంగా ఉపయోపడుతుంది!