Valentines Week Recipe: వాలెంటైన్స్ స్పెషల్ రెసిపీ.. మినీ చాకొలెట్ కేక్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఫిబ్రవరి 7 నుండి ప్రారంభమయ్యే వాలెంటైన్ వీక్, ఫిబ్రవరి 14న వాలెంటైన్ డేతో ముగుస్తుంది.
ఈ ప్రేమ వారంలో రోజ్ డే, టెడ్డీ డే, చాకొలెట్ డే వంటి విశేషమైన రోజులు ఉంటాయి.
ఈ సమయంలో ప్రేమికులు, జీవిత భాగస్వాములు ఒకరికొకరు ప్రత్యేకంగా అనిపించేలా సర్‌ప్రైజ్‌లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. మీరు కూడా మీ ప్రియుడు/ప్రియురాలిని ఆకట్టుకోవాలని అనుకుంటే, ముఖ్యంగా వారు చాకొలెట్ ప్రేమికులైతే, ఈ రెసిపీ మీకు ఎంతో ఉపయోగపడుతుంది.
మీ వాలెంటైన్‌ను సంతోషపెట్టేందుకు ఈ స్వీట్ సర్‌ప్రైజ్‌ను స్వయంగా తయారు చేసి గిఫ్ట్ ఇస్తే, వారిని ఎంతగానో ప్రభావితం చేయవచ్చు.
వివరాలు
హోమ్‌మేడ్ చాకొలెట్ రెసిపీ- మినీ చాకొలెట్ కేక్స్
కావాల్సిన పదార్థాలు:
ఒక కప్పు గోధుమ పిండి
అర కప్పు చక్కెర పొడి
ఒక టేబుల్ స్పూన్ పాల పొడి
రెండు టేబుల్ స్పూన్ల కొకో పౌడర్
ఒక టీస్పూన్ బేకింగ్ పౌడర్
అర టీస్పూన్ బేకింగ్ సోడా
చిటికెడు ఉప్పు
ముప్పావు కప్పు పాలు
పావు కప్పు నూనె
ఒక టీస్పూన్ వెనీలా ఎసెన్స్
పావు కప్పు పెరుగు
అరటీస్పూన్ వెనిగర్
డ్రై ఫ్రూట్స్
వివరాలు
మినీ చాకోలెట్ కేక్స్ తయారీ విధానం:
ఒక బౌల్ తీసుకుని దాని మీద పిండ జల్లెడ ఉంచండి.
జల్లెడలో గోధుమపిండి, చక్కెర పొడి, పాల పొడి, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి జల్లించండి.
అన్ని పొడి పదార్థాలు బాగా కలిసిపోయేలా కలిపి పక్కకు పెట్టుకోండి.
వేరొక బౌల్ తీసుకుని అందులో పాలు, నూనె, వెనీలా ఎసెన్స్, పెరుగు వేసి బాగా కలపండి.
ఈ ద్రవ మిశ్రమాన్ని, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి మిశ్రమంలో వేసి బాగా కలపండి.
మిశ్రమం చిక్కగా పేస్టులా తయారైన తర్వాత, అందులో వెనిగర్ వేసి మళ్ళీ కలపండి.
గుంట పొంగనాల ప్యాన్ తీసుకుని అన్ని గుంటల్లో నూనె వేసి పట్టించండి.
వివరాలు
మినీ చాకోలెట్ కేక్స్ తయారీ విధానం:
సిద్ధం చేసుకున్న చాకొలెట్ బ్యాటర్‌ను ప్రతి గుంటలో పోయండి.
బ్యాటర్‌పై నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్‌ను చక్కగా చల్లి పెట్టండి.
స్టవ్ ఆన్ చేసి, గుంట పొంగనాల ప్యాన్‌ను ఉంచి దాదాపు 8-10 నిమిషాల పాటు ఉడికించండి.
లోపల పూర్తిగా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి టూత్‌పిక్ ద్వారా పరీక్షించండి.
టూత్‌పిక్ సున్నితంగా బయటకు వస్తే కేక్ రెడీ అయినట్లే, లేదంటే ఇంకొంతసేపు ఉడికించండి.
స్టవ్ ఆఫ్ చేసి, కేక్‌ను సున్నితంగా బయటకు తీసి సర్వ్ చేయండి. ప్రేమికుల రోజునో, వాలెంటైన్స్ వీక్ రోజునో ఈ ప్రత్యేకమైన చాకొలెట్ కేక్‌ను తయారు చేసి మీ ప్రియమైన వారికి అందించి సంతోషపెట్టండి!