
Vinayaka Chavithi: 2025:వినాయక చవితికి ముందు ఇంటి నుంచి ఈ వస్తువులు తొలగిస్తే మీకు అన్ని దిశల్లో ఆనందమే!
ఈ వార్తాకథనం ఏంటి
హిందూ సంప్రదాయంలో అనేక దేవతలను పూజిస్తాం. ఏదైనా దైవాన్ని ఆరాధించేముందు వినాయకుడిని మొదట పూజిస్తారు. దీనికి కారణం, వినాయకుడిని మొదటి ఆరాధ్య దేవుడుగా పరిగణించడం. ప్రతి మంగళకార్య ప్రారంభానికి ముందు ఆయనను పూజించడం ఆచారంగా ఉంది, ఎందుకంటే వినాయకుడు మన జీవితంలోని ప్రతి అవరోధాన్ని తొలగిస్తాడు. అదే విధంగా మరి కొన్ని రోజుల్లో వినాయక చవితి రాబోతోంది. ప్రతి భాద్రపద మాసం శుక్లపక్షం నాల్గవ రోజున గణేష్ చతుర్థిని జరుపుకుంటారు. మహారాష్ట్రలో ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. గత కొన్నేళ్లుగా దీన్ని దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు.
వివరాలు
2025లో వినాయక చవితి ఎప్పుడు?
హిందూ క్యాలెండర్ ప్రకారం, భాద్రపద మాసంలో శుక్లపక్షం నాల్గవ రోజు వినాయక చవితి జరుపుకుంటారు. ఈ ఏడాది వినాయక చవితి ఆగస్టు 26న ప్రారంభమై, ఆగస్టు 27 మధ్యాహ్నం ముగుస్తుంది. అందుకే, 27వ తేదీ సాయంకాలం వరకు ఈ పండుగ జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు తమ ఇళ్లలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. చాలా మంది తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్దలతో వినాయక నవరాత్రులను జరుపుతారు. అయితే, చవితి జరుపుకునే ముందు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం అవసరం.
వివరాలు
వినాయక చవితికి ముందు ఇంటి నుంచి తొలగించవలసిన వస్తువులు
పగిలిన విగ్రహాలు: ఇంట్లో పూజ గదిలో ఏదైనా విగ్రహం పగిలి ఉంటే,దాన్ని తొలగించాలి.ఇలా చేయకపోతే,ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది,సానుకూల శక్తి తగ్గుతుంది. పనికిరాని వస్తువులు: ఇంట్లో అవసరం లేని లేదా పగిలిన వస్తువులను తొలగించాలి. ఏదైనా వస్తువులు పనిచేయకపోతే, ముందుగా వాటిని రిపేర్ చేయాలి లేదా పూర్తిగా బయటకు తీయాలి. పూజ గదిని శుభ్రంగా ఉంచుకోండి: వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించేముందు పూజ గదిని పూర్తిగా శుభ్రం చేసుకోవడం అత్యవసరం.ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం స్థిరపడుతుంది. గమనిక: ఈ వ్యాసంలో ఇచ్చిన సూచనలు సాధారణ ఆచారాల ఆధారంగా అందించబడ్డాయి. వాటి ఖచ్చితత, ఫలితాలు 100% నిర్ధారించలేము. వీటిని పాటించేముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.