బాలాపూర్ గణేషుడు: మొదటి సారి వేలంలో లడ్డూకి ఎంత ధర పలికిందో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
బాలాపూర్ గణేషుడు... ఈ పేరు చెప్పగానే అందరికీ లడ్డూ వేలం గుర్తుకొస్తుంది.
అత్యంత ఎత్తుతో ఖైరతాబాద్ గణేషుడు అందరినీ ఆకర్షిస్తుంటే లడ్డూ వేలంతో బాలాపూర్ గణేషుడికి ఎంతో పేరు వచ్చింది. 4
బాలాపూర్ గణేషుడి లడ్డూను లక్షల రూపాయలు చెల్లించి వేలంపాటలో దక్కించుకుంటారు. ప్రస్తుతం బాలాపూర్ గణేషుడిని విశేషాలు తెలుసుకుందాం.
బాలాపూర్ గణేషుడుని 1980సంవత్సరంలో మొదటిసారిగా బాలాపూర్ గ్రామస్తులు గణేషుడిని ఏర్పాటు చేశారు. అయితే 1994నుండి లడ్డూ వేలం ప్రారంభమైంది.
మొదటిసారి బాలాపూర్ గణేష్ లడ్డూని 450రూపాయలకు కొలను మోహన్ రెడ్డి దక్కించుకున్నారు. 2022లో వంగేటి లక్ష్మారెడ్డి 24లక్షల 60వేల రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు.
ఇప్పటివరకు లడ్డు వేలం ద్వారా 1,77,37, 955రూపాయలు వచ్చాయి.
Details
వేలం పాటలో 21కిలోల లడ్డూ
ప్రతీ ఏడాది 21కిలోల లడ్డూని తయారు చేస్తారు. ఈసారి 18అడుగుల ఎత్తయిన గణపతి విగ్రహాన్ని పూజించనున్నారు.
ఆల్రెడీ గణేష్ మండప నిర్మాణ పనులు మొదలైపోయాయి. విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయం మాదిరిగా గణపతి మండపాన్ని తయారు చేస్తున్నారు. దీనికోసం 40మంది కళాకారులు పనిచేస్తున్నారు.
బాలాపూర్ గణపతి ఉత్సవ పనులను ఉత్సవ సమితి చూసుకుంటుంది. ఈసారి బాలాపూర్ గణపతి ఉత్సవ సమితి అధ్యక్షుడిగా కళ్లెం నిరంజన్ రెడ్డి ఉన్నారు.
హైదరాబాదులో 11రోజుల తర్వాత నిమజ్జనానికి కదిలే మొట్టమొదటి గణపతి బాలాపూర్ గణేశుడు. బాలాపూర్ గణేశుడు కదిలిన తర్వాతే మిగిలిన గణపతులు కదులుతాయి.