తదుపరి వార్తా కథనం

వైరల్ వీడియో: కన్నార్పకుండా ఫోటోగ్రాఫర్ ను చూస్తున్న చిరుత వీడియో
వ్రాసిన వారు
Sriram Pranateja
Jun 19, 2023
02:37 pm
ఈ వార్తాకథనం ఏంటి
వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారం. అయినా కూడా దాని మీదున్న ప్యాషన్ తో అడవుల్లోకి వెళ్ళి మరీ వన్యమృగాల ఫోటోలు, వీడియోలను తీస్తుంటారు.
తాజాగా షాజ్ జంగ్ అనే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ తీసిన ఒక వీడియో, ఇంటర్నెట్ యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
కెమెరా వైపు కన్నార్పకుండా భయంకరంగా చూస్తున్న చిరుతను చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. ఫోటోగ్రాఫర్ దూరంలో ఉండొచ్చు గానీ ఆ వీడియో చూస్తుంటే ఒక రకమైన కంపనం కలగడం సహజం.
ఇప్పటివరకు ఈ వీడియోను 20లక్షల మందికి పైగానే చూసారు. ఈ వీడియోకు ఫిదా అయిన నెటిజన్లు, రకరకాల కామెంట్లు చేస్తున్నారు.