వైరల్ వీడియో: పెంపుడు కుక్కపిల్ల సేవలకు గుర్తింపుగా డిప్లొమా సర్టిఫికేట్ అందజేసిన విశ్వ విద్యాలయం
ఈ వార్తాకథనం ఏంటి
ఇంటర్నెట్ లో వైరల్ అయ్యే వీడియోల్లో పెంపుడు జంతువుల వీడియోలు అందరినీ ఆకట్టుకుంటాయి. పెంపుడు జంతువుల చేష్టలు నవ్వు తెప్పించడంతో పాటు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి.
అలాంటి వీడియోను ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాము. అమెరికాకు చెందిన సెటాన్ హాల్ యూనివర్సిటీ, ఒకానొక స్టూడెంట్ పెంచుకునే కుక్కపిల్ల సేవలను గుర్తించి డిప్లొమా సర్టిఫికేట్ అందజేసింది.
దివ్యాంగురాలయిన మరియానా, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ లో డిగ్రీ అందుకుంది. వీల్ ఛెయిర్ లో కూర్చునే మరియానాకు సేవలందించడానికి జస్టిన్ అనే పేరుగల కుక్కపిల్ల ఉంది.
మరియానా డిగ్రీ చదవడానికి యూనివర్సిటీకి వచ్చిన ప్రతీరోజూ కుక్కపిల్ల కూడా వచ్చేది. ఈ నేపథ్యంలో కుక్కపిల్ల అంకితభావానికి గుర్తింపుగా డిప్లొమా సర్టిఫికేట్ అందజేసారు.
Details
కుక్కపిల్లను పొగుడుతూ కామెంట్స్
సర్టిఫికేట్ అందుకోవడానికి మరియానా, తన పెంపుడు కుక్కపిల్లతో పాటు వచ్చింది. ముందుగా, జస్టిన్ సేవలను గుర్తిస్తూ సెటాన్ హాల్ యూనివర్సిటీ ప్రతినిధి, జోసెఫ్ ఈ నైయర్ సర్టిఫికేట్ అందజేసారు.
వేదిక మీదకు జస్టిన్ చేరుకున్న జస్టిన్, తన నోటితో సర్టిఫికేట్ ని పట్టుకుంది. అది చూసి అక్కడున్న జనాలందరూ ఉత్సాహంగా కేరింతలు కొట్టారు.
ఈ వీడియోను సెటాన్ హాల్ అధికారిక ఖాతాలో పోస్టు చేసారు. దాంతో, వైరల్ గా మారింది. మారియానా చదువు కోసం ఒక్కరోజు కూడా మిస్ అవకుండా సేవలందించిన కుక్కపిల్లను పొగుడుతూ కామెంట్స్ పెడుతున్నారు.