Visa-Free Destinations: వీసా అవసరం లేకుండా ఈ దేశాలకు వెళ్లి రావచ్చు..!
ఇటీవలకాలంలో భారతీయులు టూర్స్, ట్రావెలింగ్‌పై పెరుగుతున్న ఆసక్తిని కనబరుస్తున్నారు. ఉరుకులు పరుగుల జీవితం మధ్యలో టైమ్ దొరికినప్పుడల్లా ట్రిప్స్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని దేశాలు సులభంగా, తక్కువ ఖర్చుతో బడ్జెట్ టూర్ ప్యాకేజీలు అందిస్తున్నారు. దీని ద్వారా ప్రతి సంవత్సరం లక్షలాది మంది భారతీయులు విదేశీ పర్యటనలు చేపడుతున్నారు. అయితే, విదేశాలకు వెళ్లడానికి వీసా అవసరం ఉంటుంది. కానీ కొన్ని దేశాలకు భారతీయులు వీసా లేకుండా కూడా వెళ్లొచ్చని తెలుసా. ఈ డెస్టినేషన్లకు ట్రిప్స్ ప్లాన్ చేస్తే, వీసా ఖర్చు లేకుండా మాత్రమే విమాన ఛార్జీలు, హోటల్ బస, ఆహారాల కోసం బడ్జెట్‌ను ప్రణాళిక చేసుకోవాలి.
26 దేశాలు భారతీయులకు వీసా లేకుండా ప్రవేశాన్ని అనుమతిస్తాయి
భారతీయులు కొన్ని దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు, మరికొన్ని దేశాలకు వీసా ఆన్ అరైవల్ (Arrival) ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ దేశాలను వివరంగా పరిశీలిద్దాం. 30 రోజులు వీసా లేకుండా వెళ్లగలిగే దేశాలు: ప్రపంచంలోని 26 దేశాలు భారతీయులకు వీసా లేకుండా ప్రవేశాన్ని అనుమతిస్తాయి. ఈ దేశాలలో వీసా లేకుండా ఉండే వ్యవధి ఒక్కొక్కటిగా మారుతుంది. ఉదాహరణకు, థాయిలాండ్ కు వెళ్లే భారతీయులు 30 రోజులు వీసా లేకుండా పర్యటించవచ్చు. అలాగే మలేషియా, అంగోలా, మకావూ, మైక్రోనేషియా, వనాటు వంటి దేశాలలో కూడా 30 రోజులు వీసా అవసరం లేదు.
90 రోజుల వీసా అవసరం లేదు
మారిషస్, కెన్యా, బార్బడోస్, గాంబియా, కిరిబాటి, గ్రెనడా, హైతీ, ట్రినిడాడ్, టొబాగో, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సెనెగల్ వంటి దేశాలలో భారతీయులు 90 రోజులు వీసా లేకుండా ఉంటూ పర్యటించవచ్చు. వీసా లేకుండా అత్యధిక రోజులు ఎక్కడ ఉండవచ్చు? భూటాన్, కజకిస్థాన్ వంటి దేశాల్లో భారతీయులకు కేవలం 14 రోజులు మాత్రమే వీసా లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఫిజీ దేశంలో 120 రోజుల వరకు వీసా అవసరం ఉండదు. అదే డొమినికాలో వీసా లేకుండా 6 నెలలు (180 రోజులు) ఉండవచ్చు. 2024 ఫిబ్రవరి 4 నాటికి ఇరాన్ దేశంలో కూడా వీసా అవసరం లేకుండా భారతీయులు పర్యటించవచ్చు.
రోడ్డు మార్గంలో ట్రిప్‌లు కూడా ప్లాన్ చేయవచ్చు?
కొన్ని దేశాలకు, వీసా లేకుండా రోడ్డు మార్గంలో ప్రయాణించవచ్చు. రోడ్డు ట్రిప్స్‌ను ప్లాన్ చేసే వారు భారతదేశం నుంచి సులభంగా మరికొన్ని దేశాలకు చేరుకోవచ్చు. మన డ్రైవింగ్ లైసెన్స్ కూడా కొన్ని దేశాల్లో చెల్లుబాటు అవుతుంది. ఉదాహరణకు, బంగ్లాదేశ్‌కి రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలంటే సునామస్జిద్ సుల్కా చెక్‌పాయింట్ లేదా పెట్రాపోల్-బెనాపోల్ బోర్డర్ ను దాటవచ్చు. నేపాల్‌కి కూడా రోడ్డు మార్గం ద్వారా వెళ్లవచ్చు ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ మీదుగా ప్రయాణించి, సునౌలీ బోర్డర్ చెక్‌పాయింట్ ద్వారా నేపాల్ రాజధాని ఖాట్మాండు చేరుకోవచ్చు. ఢిల్లీ నుంచి భూటాన్‌కి కూడా రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు, దీనికి గౌహతీ ద్వారా ఫుయంత్‌షోలింగ్ బోర్డర్ చేరుకోవాలి.