IRCTC : టూర్ లవర్స్‌కు బంపరాఫర్.. సమ్మర్‌లో అరకు అందాలు ఆస్వాదించండిలా
ఈ వార్తాకథనం ఏంటి
ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే వారికి అరకు, విశాఖపట్నం అద్భుతమైన పర్యాటక కేంద్రాలు. విశాఖలో విస్తారమైన సముద్ర తీరాలు, అలల అందాలు, అరకులోని పచ్చని ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఈ అందాలను మూడు రోజుల్లో ఆస్వాదించేలా ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్రయాణం గుర్తుండిపోయే అనుభవాలను అందించేలా రూపొందించబడింది. మరి ఈ ప్రయాణం ఖర్చు ఎంత ఉంటుంది? ఎన్ని రోజులు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వివరాలు
మొదటి రోజు ప్లాన్ ఇలా..
విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్, బస్టాండ్ వద్ద పికప్ సౌకర్యం ఉంటుంది. ఉదయం ఆయా ప్రదేశాల నుంచి ప్రయాణికులను తీసుకుని సుమారు 11 గంటలలోపు హోటల్‌కు చేర్చుతారు. అక్కడ ఫ్రెషప్ అయ్యి భోజనం చేసిన అనంతరం పర్యటన ప్రారంభమవుతుంది. తొలుత తొట్లకొండ బౌద్ధ క్షేత్రం, అనంతరం కైలాసగిరి, తర్వాత రుషికొండ బీచ్ సందర్శిస్తారు. సాయంత్రానికి హోటల్‌కు తిరిగి చేరుకుని, రాత్రి భోజనం అనంతరం అక్కడే బస ఏర్పాటు చేస్తారు.
వివరాలు
రెండో రోజు:
ఉదయం అల్పాహారం అనంతరం సుమారు 8 గంటలకు అరకు బయలుదేరుతారు. అక్కడ పద్మాపురం గార్డెన్స్, గిరిజన మ్యూజియం, అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వీక్షణ స్థలం సందర్శిస్తారు. చివరగా బొర్రా గుహలను దర్శించి తిరిగి విశాఖపట్నానికి చేరుకుంటారు. రాత్రి భోజనం చేసి అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. రెండో రోజు ఆహ్లాదకర వాతావరణంలో ఎంజాయ్ చేస్తారు.
వివరాలు
మూడో రోజు సాగుతుందిలా..
ఉదయం అల్పాహారం అనంతరం హోటల్ గది ఖాళీ చేయాలి. ఆపై సబ్‌మరైన్ మ్యూజియం సందర్శన ఉంటుంది. తర్వాత రామానాయుడు ఫిల్మ్ స్టూడియో, బీచ్ రోడ్ మీదుగా ప్రయాణించి చివరకు ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్ లేదా బస్టాండ్ వద్ద డ్రాప్ చేస్తారు. దీంతో యాత్ర ముగుస్తుంది. ఈ ప్యాకేజీ ప్రతిరోజూ అందుబాటులో ఉంటుంది. అయితే, సబ్‌మరైన్ మ్యూజియం సోమవారం మూసివుండగా, రామానాయుడు ఫిల్మ్ స్టూడియోకి సోమవారం మాత్రమే అనుమతి ఉంటుంది.
వివరాలు
టికెట్ ధరల వివరాలు..
1 నుంచి ముగ్గురికి బుకింగ్ చేస్తే: కంఫర్ట్ క్లాస్ సింగిల్ ఆక్యుపెన్సీ: రూ.20,035 డబుల్ ఆక్యుపెన్సీ: రూ.10,860 త్రిబుల్ ఆక్యుపెన్సీ: రూ.8,450 పిల్లలు (బెడ్‌తో): రూ.6,220 పిల్లలు (బెడ్ లేకుండా): రూ.3,770 4 నుంచి 6 మంది బుకింగ్ చేస్తే: డబుల్ ఆక్యుపెన్సీ: రూ.9,800 త్రిబుల్ ఆక్యుపెన్సీ: రూ.9,095 పిల్లలు (బెడ్‌తో): రూ.6,865 పిల్లలు (బెడ్ లేకుండా): రూ.6,290 7 నుంచి 10 మంది బుకింగ్ చేస్తే: డబుల్ ఆక్యుపెన్సీ: రూ.9,220 త్రిబుల్ ఆక్యుపెన్సీ: రూ.8,515 పిల్లలు (బెడ్‌తో): రూ.6,285 పిల్లలు (బెడ్ లేకుండా): రూ.5,710
వివరాలు
బుకింగ్, నిబంధనలు ఇవే..
కనీసం 15 రోజుల ముందు బుకింగ్ చేస్తే పైధరలు వర్తిస్తాయి. యాత్ర ప్రారంభానికి 15 రోజుల లోపుగా బుకింగ్ చేస్తే ప్రతి వ్యక్తికి రూ.250 అదనంగా చెల్లించాలి. 8 నుంచి 14 రోజుల మధ్య బుకింగ్ చేస్తే 25% అదనపు ఛార్జీ ఉంటుంది. 4 నుంచి 7 రోజుల మధ్య బుకింగ్ చేస్తే 50% అదనంగా వసూలు చేస్తారు. 4 రోజుల లోపు బుకింగ్ చేస్తే ప్యాకేజీ ధరపై 100% అదనంగా చెల్లించాలి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: చందన్: 82879 32318 సాయి ప్రసాద్: 92814 95847 వెంకటేశ్: 95501 66168 ఈ ప్యాకేజీ ద్వారా తక్కువ సమయంలో విశాఖ, అరకు అందాలను సంపూర్ణంగా ఆస్వాదించవచ్చు.