పని చేస్తున్నప్పుడు మనసు పాడైతే ఎలా బాగుచేసుకోవాలో తెలుసుకోండి
మనకు ఇష్టమైన పని చేస్తున్నా కూడా ఒక్కోసారి ఎందుకో తెలియని అలసట, అసహనం కలుగుతూ ఉంటుంది. దానివల్ల ఆరోజు మొత్తం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. చాలామంది ఈరోజు వర్క్ ఏ ముహూర్తాన మొదలెట్టానో కానీ మనసంతా పాడైపోయిందని అంటారు. ఇలాంటి పరిస్థితి నుండి తొందరగా బయటడాలి. అందుకోసం ఏం చేయాలో చూద్దాం. శారీకంగా యాక్టివ్ గా ఉండండి: శరీర అవయవాలను కదిలించే వ్యాయామాలు, యోగా చేయండి. దీనివల్ల పనిపట్ల అలసట రాదు. అంతేకాదు మనసు మీద మంచి ప్రభావం చూపి పనిపట్ల ఆసక్తిని కలిగిస్తుంది. బ్రేక్ తీసుకోండి: గంటల తరబడి లాప్టాప్ ల ముందు కూర్చోవడం వల్ల తెలియకుండానే అలసట వచ్చేస్తుంది. అందుకే కొంతసేపు బ్రేక్ తీసుకోండి.
మాటలు చూపే ప్రభావం అంతా ఇంతా కాదు
మనస్సు మార్చుకోండి: మనసు పాడైపోయిన రకరకాల చెడు ఆలోచనలు వస్తాయి. వాటిని రానివ్వకుండా ఉండాలంటే ఒక్కసారి గట్టిగా గాలి పీల్చుకుని వదిలేయండి. పాజిటివ్ గా ఆలోచించండి. ఎవరితోనైనా మాట్లాడండి: మనస్సు పాడైనపుడు ఒంటరిగా బాధపడటం కంటే నలుగురితో పంచుకోవడమే మంచిది. అది పనికి సంబంధించినదైతే ఖచ్చితంగా పంచుకోవడమే బెటర్. మీ సహోద్యోగులలో మీరు ఎక్కువ స్నేహంగా ఉండేవారితో కాసేపు మాట్లాడండి. మాటల వల్ల లోపలున్న అనవసర ఆందోళన, కంగారు దూరమైపోయి ప్రశాంతంగా మారుతుంది. అవసరం అనుకుంటే మీ మేనేజర్ తో మాట్లాడండి. మాట్లాడితే పోయేదేమీ లేదు, మీ మనసుల్లోని నెగెటివిటీ తప్ప.