Loading...
Electricity bill saving tips: ఏసీ, ఫ్రిజ్ వాడుతున్నా బిల్లు తగ్గాలంటే..? ఈ స్మార్ట్ ట్రిక్స్ తప్పక తెలుసుకోండి!
ఏసీ, ఫ్రిజ్ వాడుతున్నా బిల్లు తగ్గాలంటే..? ఈ స్మార్ట్ ట్రిక్స్ తప్పక తెలుసుకోండి!

Electricity bill saving tips: ఏసీ, ఫ్రిజ్ వాడుతున్నా బిల్లు తగ్గాలంటే..? ఈ స్మార్ట్ ట్రిక్స్ తప్పక తెలుసుకోండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 07, 2026
11:30 am

ఈ వార్తాకథనం ఏంటి

వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఫ్యాన్‌లు, ఏసీలు, ఫ్రిజ్‌లు, కూలర్లు 24 గంటలు నడుస్తూనే ఉంటాయి. దీంతో నెలాఖరులో వచ్చే భారీ కరెంటు బిల్లులు చూసి చాలా మంది షాక్ అవుతుంటారు. అయితే కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే, ఈ ఉపకరణాలను రోజంతా వాడినా విద్యుత్ ఖర్చును గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం నుంచే ఎండలు మండిపోతుండటంతో ఇళ్లలో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరం పనిచేస్తుంటాయి. కానీ వాటిని ఎలా స్మార్ట్‌గా ఉపయోగించాలో తెలుసుకుంటే బిల్లును తగ్గించడం చాలా సులభం.

వివరాలు

ఏసీ వినియోగం ఇలా ఉంటే మంచిది

చాలామంది గది త్వరగా చల్లబడాలని ఏసీని 16°C లేదా 18°C వద్ద ఉంచుతారు. ఇది కంప్రెసర్‌పై అదనపు భారం పెంచి కరెంటు వినియోగాన్ని పెంచుతుంది.

అందుకే ఏసీని ఎప్పుడూ 24°C నుంచి 26°C మధ్య ఉంచడం ఉత్తమం. ఇలా చేస్తే సుమారు 20 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది.

అలాగే గదిలో చల్లదనం బయటకు పోకుండా కిటికీలు, తలుపులు బాగా మూసి ఉంచాలి.

వివరాలు

ఫ్రిజ్ వాడకంలో జాగ్రత్తలు

ఫ్రిజ్‌ను పదే పదే తెరవడం వల్ల లోపలి చల్లదనం తగ్గిపోతుంది. మళ్లీ చల్లబడటానికి ఎక్కువ విద్యుత్ అవసరం అవుతుంది.

ఫ్రిజ్‌ను గోడకు పూర్తిగా అంటించకుండా వెనుక కనీసం 6 అంగుళాల దూరం ఉంచాలి.

వేడి పదార్థాలను నేరుగా ఫ్రిజ్‌లో పెట్టకుండా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఉంచాలి.

లైటింగ్‌లో మార్పులు

ఇంకా పాత ట్యూబ్ లైట్లు, సాధారణ బల్బులు వాడుతున్నట్లయితే వెంటనే LED బల్బులకు మారాలి.

ఇవి సుమారు 80 శాతం వరకు తక్కువ విద్యుత్ వినియోగిస్తాయి. పైగా వేడి కూడా తక్కువగా విడుదల చేస్తాయి.

ADVERTISEMENT

వివరాలు

స్టాండ్‌బై పవర్‌ను తగ్గించండి

టీవీ, కంప్యూటర్, మైక్రోవేవ్ వంటి పరికరాలను రిమోట్‌తో ఆఫ్ చేసినా అవి స్టాండ్‌బై మోడ్‌లో కరెంటు వినియోగిస్తూనే ఉంటాయి.

కాబట్టి వాడనప్పుడు మెయిన్ స్విచ్ ఆఫ్ చేయడం లేదా ప్లగ్ తీసేయడం మంచిది.

సోలార్ వైపు అడుగు

ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం ప్రారంభంలో ఖర్చుగా అనిపించినా, దీర్ఘకాలంలో భారీగా డబ్బు ఆదా అవుతుంది. ప్రభుత్వం కూడా దీనికి సబ్సిడీలు అందిస్తోంది.

ADVERTISEMENT

వివరాలు

కూలర్ వినియోగంలో చిట్కాలు

ఎయిర్ కూలర్‌ను కిటికీ దగ్గర ఉంచితే బయటి గాలి లోపలికి వచ్చి గదిని చల్లగా ఉంచుతుంది. కూలర్ ప్యాడ్లను తరచూ శుభ్రం చేస్తే మోటార్‌పై లోడ్ తగ్గి విద్యుత్ వినియోగం తగ్గుతుంది.

ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే కరెంటు బిల్లు తగ్గడమే కాకుండా, మీ విద్యుత్ ఉపకరణాల పనితీరు మెరుగుపడి, వాటి జీవితకాలం కూడా పెరుగుతుంది.

ఇక ఆలస్యం ఎందుకు.. ఈరోజు నుంచే ఈ టిప్స్ ఫాలో అయి మీ ఖర్చులను నియంత్రించండి.

ADVERTISEMENT