LOADING...
Christmas 2026: క్రిస్మస్ రోజునే యేసు జన్మించారా? ఈ పర్వదినం వెనుక ఉన్న అసలైన కథ ఇదే!
క్రిస్మస్ రోజునే యేసు జన్మించారా? ఈ పర్వదినం వెనుక ఉన్న అసలైన కథ ఇదే!

Christmas 2026: క్రిస్మస్ రోజునే యేసు జన్మించారా? ఈ పర్వదినం వెనుక ఉన్న అసలైన కథ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 16, 2025
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

లోకానికి రక్షణనిచ్చిన కరుణామయుడు ఏసుక్రీస్తు జన్మించిన పవిత్ర దినమే క్రిస్మస్‌. ఈ శుభదినాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. చర్చిలన్నింటిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించటం సంప్రదాయం. భారతదేశంలో గోవా, కేరళ వంటి రాష్ట్రాలతో పాటు క్రైస్తవ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి కేక్ కట్ చేయడం, ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఈ పండుగ వేళ చిన్నారుల నుంచి పెద్దల వరకూ అందరూ శాంతా క్లాజ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తారు. ఈ సందర్భంగా క్రిస్మస్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

Details

ఏసుక్రీస్తు జన్మ కథ

చరిత్రలో ఏసుక్రీస్తు పుట్టిన తేదీ విషయంలో పలు అభిప్రాయాలు ఉన్నప్పటికీ, క్రైస్తవ మత విశ్వాసం ప్రకారం డిసెంబర్ 25న మేరీమాతకు యేసుక్రీస్తు జన్మించాడని ఎక్కువమంది నమ్ముతారు. మేరీమాతకు గ్యాబ్రియేల్ అనే దేవదూత దర్శనమిచ్చి, నువ్వు దైవానుగ్రహం వల్ల గర్భం దాలుస్తావు. ఒక మహోన్నత శిశువును కంటావు. అతనికి 'యేసు' అని పేరు పెట్టాలి. ఎందుకంటే అతడే దేవుని కుమారుడు అని చెప్పి అంతర్ధానమయ్యాడని బైబిల్‌ కథనం చెబుతుంది. ఆ సమయంలో హేరోదు అనే చక్రవర్తి యేసును భవిష్యత్తులో యూదుల రాజుగా భావించి అతన్ని సంహరించాలనే కుట్ర పన్నాడు. ఈ విషయం తెలుసుకున్న మేరీ, జోసెఫ్‌లు ప్రాణహాని తప్పించుకునేందుకు బెత్లేహాన్ని విడిచి వెళ్లారు.

Details

దేవుని కుమారుడి జననం

ఆ ప్రయాణంలో ఓ సత్రం యజమాని తన పశువుల పాకలో వారికి తలదాచుకునే చోటు కల్పించాడు. అదే పశువుల పాకలో మేరీమాత ఏసుక్రీస్తుకు జన్మనిచ్చింది. ఆ రాత్రి ఆకాశం నుంచి ఓ దేవదూత దిగివచ్చి అక్కడ ఉన్న గొర్రెల కాపరులకు దర్శనమిచ్చాడు. ప్రకాశవంతమైన వెలుగులు చూసి వారు భయపడగా, దేవదూత "భయపడవద్దు. మీకు శుభవార్త చెప్పేందుకు వచ్చాను. ఈ రోజు బెత్లేహంలో లోక రక్షకుడు జన్మించాడు. అతడే ప్రభువు. పశువుల పాకలో అమ్మ ఒడిలో నిద్రిస్తుండటమే అతని గుర్తు అని తెలిపాడు. ఆ వెంటనే అనేక దేవదూతలు దేవుణ్ని స్తుతిస్తూ గీతాలు ఆలపించి ఒక్కసారిగా అదృశ్యమయ్యారు.

Advertisement

Details

రెండు వేల సంవత్సరాల క్రితం జననం

గొర్రెల కాపరులు పశువుల పాకకు చేరుకుని శిశువు యేసుతో పాటు మేరీ, జోసెఫ్‌లను చూశారు. దేవదూత చెప్పిన విషయాలను అందరికీ తెలియజేశారు. అలా దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం డిసెంబర్ 24 అర్ధరాత్రి తరువాత యేసుక్రీస్తు జన్మించాడు. అందుకే ప్రతి ఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్‌ను జరుపుకుంటారు.

Advertisement

Details

శాంతా క్లాజ్ గిఫ్టుల కథ

మరో విశ్వాసం ప్రకారం, క్రిస్మస్ ముందు రోజు రాత్రి శాంతా తాత ఆకాశం నుంచి వచ్చి పిల్లలకు గిఫ్టులు ఇస్తాడని చాలా మంది నమ్ముతారు. అందుకోసం ఇళ్లలో క్రిస్మస్ ట్రీలను అలంకరించి, వాటికి మేజోళ్లు వేలాడదీస్తారు. శాంతా తాత ఆ మేజోళ్లలో బహుమతులు పెట్టి వెళ్తాడనే నమ్మకం పిల్లల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. క్రిస్మస్ సందర్భంగా పేదలకు దానధర్మాలు చేయడం, మిషనరీలకు విరాళాలు ఇవ్వడం, ప్రపంచ శాంతి, మానవ సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయడం క్రైస్తవ సంప్రదాయంగా కొనసాగుతోంది. ప్రేమ, క్షమ, దయ అనే విలువలను గుర్తు చేస్తూ క్రిస్మస్ పండుగ ప్రపంచమంతా ఆనందాన్ని పంచుతోంది.

Advertisement