Page Loader
Summer Health tips: అధిక శరీర వేడిని తగ్గించడానికి ఈ చిట్కాలు పాటించండి.. వేడి చేయదు
అధిక శరీర వేడిని తగ్గించడానికి ఈ చిట్కాలు పాటించండి.. వేడి చేయదు

Summer Health tips: అధిక శరీర వేడిని తగ్గించడానికి ఈ చిట్కాలు పాటించండి.. వేడి చేయదు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 03, 2025
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏప్రిల్ నెల ప్రారంభమైతే ఎండల తీవ్రత అంతకంతకూ పెరుగుతుంది. పెరుగుతున్న వేడి, తేమ, చెమట కారణంగా అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితులు శరీర ఉష్ణోగ్రతను పెంచుతూ, వేడి అలసట, వడదెబ్బ వంటి సమస్యలకు దారితీస్తాయి. వాటిని నివారించేందుకు శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం అవసరం. బాడీ హీట్ తగ్గించుకునేందుకు ఈ చిట్కాలను పాటించండి.

వివరాలు 

ఈ సింపుల్ పనులు చేయండి చాలు, వేడి చేయదు

1) శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవాలి చల్లని నీరు, ఎలక్ట్రోలైట్ పానీయాలు శరీరాన్ని అంతర్గతంగా చల్లబరచడంలో సహాయపడతాయి. కొబ్బరి నీరు, నిమ్మరసం తక్షణ ఉపశమనం అందిస్తాయి. మజ్జిగను తప్పనిసరిగా త్రాగాలి. అందులో కొద్దిగా పుదీనా, నిమ్మరసం, ఉప్పు కలిపితే ఎండ వేడిమిని తగ్గించడంలో మరింత ఉపయోగకరంగా ఉంటుంది. 2) చల్లటి నీటితో స్నానం చేయండి చల్లని నీటితో స్నానం చేయడం ద్వారా శరీర వేడిని సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. రోజుకు కనీసం రెండుసార్లు స్నానం చేయడం శరీరానికి మేలు చేస్తుంది.

వివరాలు 

ఈ సింపుల్ పనులు చేయండి చాలు, వేడి చేయదు

3) సరైన దుస్తులు ధరించండి వేసవి వేడిని తగ్గించేందుకు కాటన్ దుస్తులను ధరించండి. వీటి వల్ల శరీరం వేగంగా చల్లబడుతుంది. బిగుతుగా ఉండే దుస్తులు ఒంటికి చికాకు కలిగించడంతోపాటు వేడిని మరింత పెంచుతాయి. అందుకే సడలిన దుస్తులు ధరించటం మంచిది. 4) కూలింగ్ ప్యాక్స్ ఉపయోగించండి శరీరంలో అధిక వేడిని తగ్గించేందుకు మణికట్టు, మెడ, నుదురు, పాదాలపై చల్లని బ్యాండేజీలు లేదా ఐస్ ప్యాక్స్ ఉంచుకోవచ్చు. 5) కెఫిన్, అధిక చక్కెర పానీయాలు తగ్గించండి కెఫిన్ లేదా ఎక్కువ చక్కెర కలిగిన పానీయాల వల్ల శరీర వేడిమి పెరిగే అవకాశముంది. వాటికి బదులుగా మజ్జిగ, కొబ్బరి నీరు వంటి సహజ పానీయాలను తీసుకోవడం మంచిది.

వివరాలు 

ఈ సింపుల్ పనులు చేయండి చాలు, వేడి చేయదు

6) తగినన్ని పరిమాణంలో నీరు త్రాగాలి రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగాలి. ఎండలో ఎక్కువ సమయం గడిపే వారు నీటిని మరింత ఎక్కువగా త్రాగడం మంచిది. తగినంత నీరు త్రాగకపోతే డీహైడ్రేషన్ సమస్యలు రావచ్చు. 7) విశ్రాంతి అవసరం శరీరాన్ని చల్లగా ఉంచేందుకు గదిలో లేదా నీడలో విశ్రాంతి తీసుకోండి. ఏసీ లేదా కూలర్ గదిలో కొన్ని సమయాలు గడపడం బాగుంటుంది. అయితే ఎక్కువ సమయం ఏసీలో ఉండటం కూడా మంచిది కాదు. 8) హైడ్రేటింగ్ పండ్లు తినండి పుచ్చకాయ, దోసకాయ, సిట్రస్ పండ్లు వంటి అధిక నీరు కలిగిన పండ్లు తీసుకోవడం శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది.