
Mangoes: మామిడి పండ్లను సహజంగా పండించే మార్గాలు..
ఈ వార్తాకథనం ఏంటి
ఇప్పుడు మార్కెట్‌లో మామిడి పళ్లను వేగంగా మగ్గించేందుకు రసాయనాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
అయితే, ఇవి ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారి అనేక రకాల అనారోగ్యాలకు కారణమవుతున్నాయి.
అయితే, రసాయనాలేం అవసరం లేకుండా సహజ పద్ధతుల్లో మామిడిని మాగించవచ్చని మీకు తెలుసా?
దీనికోసం ఆరు ప్రకృతిసిద్ధమైన మార్గాలు ఉన్నాయి.. అవేంటంటే..
ఎండుగడ్డి సహాయం తీసుకోవడం: మామిడి పళ్లను ఎండుగడ్డి వేసిన కార్డ్‌బోర్డు డబ్బాలో ఉంచాలి. ఈ ఎండుగడ్డి సహజంగా ఇథిలీన్ వాయువు ఉత్పత్తి చేస్తుంది. దాన్ని పండ్లు త్వరగా మాగేలా చేస్తుంది.
వివరాలు
ఇథిలీన్ ఉత్పత్తి చేసే పండ్లతో కలపడం:
మామిడితో పాటు యాపిల్ లేదా అరటిపళ్లను కూడా ఒకే సంచిలో ఉంచండి. ఈ పండ్లు సహజంగా ఇథిలీన్ వాయువును విడుదల చేస్తాయి. దీని ద్వారా మామిడి పండ్లు వేగంగా పక్వానికి చేరతాయి.
పేపర్‌తో చుట్టడం: ప్రతి మామిడి పండును న్యూస్‌పేపర్ లేదా పేపర్ బ్యాగులో చుట్టి ఉంచాలి. అయితే కొంత గాలి లోపలివెళ్లేలా చుట్టడం ముఖ్యం. దీని వలన పండులోని ఇథిలీన్ వాయువు విడుదల అయ్యి మగ్గడాన్ని వేగవంతం చేస్తుంది.
వివరాలు
బియ్యంలో ఉంచడం
మామిడిపళ్లను బియ్యంలో పూర్తిగా కప్పివేయడం కూడా ఒక మంచి పద్ధతి.ఇది పళ్ల చుట్టూ ఉత్పత్తి అయ్యే ఇథిలీన్ గ్యాస్‌ను లోపలే నిలిపివేస్తుంది.సాధారణంగా 12గంటల నుంచి ఒకరోజు లోపల పండ్లు పక్వానికి వస్తాయి.
గది ఉష్ణోగ్రత వద్ద ఉంచడం:పళ్లను సాదా గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే కూడా అవి నెమ్మదిగా మగ్గుతాయి. అయితే ఈ విధానం తక్కువ వేగంగా పని చేస్తుంది కాబట్టి కొంత ఓపిక అవసరం.
మైక్రోవేవ్ పద్ధతి:మామిడి పళ్లపై కొద్దిగా గాట్లు పెట్టి మైక్రోవేవ్ ఓవెన్‌లో పది సెకన్లపాటు ఉంచడం ద్వారా కూడా మాగించవచ్చు.
ఒక్కసారి లోపల ఉంచి పక్వం కాకపోతే, కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి మరల పది సెకన్ల పాటు మళ్లీ ఉంచవచ్చు.ఇలా కొన్నిసార్లు చేసి మంచి ఫలితాలు పొందవచ్చు.