ఎల్లప్పుడూ ప్రశాంతంగా, కామ్ గా ఉండేవారి అలవాట్లు ఎలా ఉంటాయో తెలుసుకోండి
ఇప్పుడున్న పరిస్థితుల్లో టెన్షన్లు, కంగారు, కోపం లేకుండా ఉండటం కష్టమైపోయింది. ఆఫీసులో వర్క్ టెన్షన్, ఇంట్లో ఇంకేదో టెన్షన్. ఆఫీసు, ఇల్లు ఒక దగ్గరైతే మరేదో కంగారు. ఇలా ప్రతీ దానికీ కంగారు పడుతూ, టెన్షన్ పడుతూ బ్రతకడమే అలవాటుగా మార్చేసుకుంటున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే ఎలాంటి టెన్షన్ లేకుండా సాధారణంగా, ప్రశాంతంగా, కామ్ గా కనిపిస్తారు. అసలు అంత కామ్ గా వాళ్ళెలా ఉంటారో మీకు తెలుసా? ప్రస్తుతం ప్రశాంతంగా ఉండేవారి అలవాట్లు ఏమిటో తెలుసుకుని అలా ఉండటానికి ట్రై చేద్దాం. వాళ్ళు ఫోనుకు బంధీ కాదు: ప్రశాంతంగా ఉండేవారు తరచూ ఫోన్లో మునిగిపోరు. స్మార్ట్ ఫోన్ అంటే కేవలం సాధనమే కానీ దానిచుట్టూ తిరుగుతూ ఉండరు.
స్మార్ట్ ఫోన్ ని పక్కన పెట్టడం వల్ల పని మీద ఫోకస్ పెరుగుతుంది
అవసరం ఉన్నప్పుడే మాత్రమే వాళ్ళు ఫోన్ ని వాడతారు. దీనివల్ల చేసే పనిమీద ఫోకస్ పెరిగి మంచి ఫలితాలు వస్తాయి. అందుకే డబ్బు, తదితర సంబంధ విషయాల్లో పెద్దగా ఇబ్బందులు ఉండవు. జీవితాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు: పేపర్ మీద గీసిన ప్లాన్ ప్రకారం జీవితం పోతుందని వాళ్ళు అనుకోరు. అనుకోని అవాంతరాలు వస్తాయని వాళ్ళకు తెలుసు. వాళ్ళ దగ్గర ప్లాన్ ఉన్నా కూడా అడ్డంకులు ఏర్పడినపుడు మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. స్వీయ రక్షణ: తమను తాము రక్షించుకోవడం జీవితంలో చాలా ముఖ్యమని వాళ్ళకు తెలుసు. అందుకే యోగా, వ్యాయామం చేస్తారు. ఆరోగ్యకరమైన సంబంధాలను కలిగి ఉంటారు.
సమస్యలను పరిష్కరించే గుణం:
ఎలాంటి సమస్యలనైనా ఈజీగా పరిష్కరించేస్తారు. ఒత్తిడిని తీసుకోకుండా పరిష్కారం కోసం ఆలోచిస్తారు. అలాగే తమ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసే స్వభావం ఉంటుంది. ఎమోషన్స్ ఎటెళ్తే అటు వెళ్లే రకం కాదు. ఈ క్షణంలో జీవిస్తారు: వీరు గతం గురించి బాధపడరు, రేపటి గురించి భయపడరు. ఇప్పుడు ఈ క్షణాన్ని ఆస్వాదిస్తారు. ధ్యానం, గార్డెనింగ్, మొక్కలు పెంచడం వంటి అలవాట్ల వల్ల తమను తాము బిజీగా ఉంచుకుంటూ ఈ క్షణంలో జీవిస్తుంటారు.