
బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ రావడానికి కారణాలు, లక్షణాలు ట్రీట్ మెంట్
ఈ వార్తాకథనం ఏంటి
ఎమోషన్స్ స్థిరంగా లేకుండా మాటిమాటికీ మారిపోవడం, అభద్రత భావం, తన మీద తనకు నమ్మకం లేకపోవడం మొదలగు లక్షణాలు మరీ తీవ్రంగా ఉన్నవారు బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్(బీపీడీ) తో బాధపడుతుండవచ్చు.
బీపీడీ వల్ల భావోద్వేగాల్లో కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. మూడు మారిపోతుంది. ఆలోచన, ప్రవర్తన మారిపోయి బంధాల మీద ప్రభావం పడుతుంది.
ఈ డిజార్డర్ తో బాధపడేవారు చిన్న చిన్న వాటికే ఎక్కువ బాధపడతారు. ప్రస్తుతం బీపీడీ లక్షణాలు, రావడానికి కారణాలు, ట్రీట్మెంట్ తెలుసుకుందాం.
ఎమోషన్స్ ఎప్పటికప్పుడు మారుతుండడం వల్ల పనిలో సమర్థత చూపలేరు. ఒక పనిమీద నుండి మరో పనిమీదకు వారి దృష్టి మరలుతుంది.
Details
బీపీడీ బాధపడితే వ్యసనాలకు బానిసగా మారతారు
తమని తాము అసహ్యించుకోవడం, తక్కువగా చూసుకోవడం మొదలగు లక్షణాల వల్ల, ర్యాష్ డ్రైవింగ్, అసురక్షిత శృంగారం, అతిగా తినడం, మాదక ద్రవ్యాలు వాడటం వంటి వ్యసనాలకు బానిసలుగా మారతారు.
ఒక వ్యక్తి బీపీడీతో బాధపడుతున్నారని తెలిపే సంకేతాలు:
తనను ఎవరూ పట్టించుకోవడం లేదన ఆలోచన, లక్ష్యాలు, గమ్యాలను వేగంగా మార్చుకోవడం, తన గురించి తాను ఏవో ఊహల్లో ఉండటం, తనకు తాను హాని కలగజేసుకోవడం, ఆత్మహత్య బెదిరింపులు, తమను ఎవరైనా రిజెక్ట్ చేస్తారేమోనని భయం లక్షణాలు కలిగి ఉంటారు.
బీపీడీ ఎందుకు వస్తుంది?
జన్యుపరంగా వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే మెదడులో ఏవైనా ఇబ్బందులు, చుట్టూ ఉండే పరిసరాలు ప్రభావితం చేయడం వల్ల కూడా బీపీడీ వస్తుంది.
Details
యవ్వనంలో అడుగుపెట్టే సమయంలో అంటుకునే డిజార్డర్
చిన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనల కారణంగా కూడా ఇలా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బాల్యం నుండి యవ్వనంలోకి అడుగుపెట్టే సమయంలో ఏవైనా అవాంఛిత సంఘటనలు జరిగితే ఇలాంటి డిజార్డర్ లు వచ్చే అవకాశం ఉంటుందట.
యాంగ్జాయిటీ డిజార్డర్, బైపోలార్ డిజార్డర్, డిప్రెసివ్ డిజార్డర్ మొదలగు డిజార్డర్లు మనిషిలో ఉన్నప్పుడు బీపీడీ కూడా వస్తుంది.
ట్రీట్మెంట్:
బీపీడీ లక్షణాలు ఏ స్థాయిలో ఉన్నాయో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సైకోథెరపీ ట్రీట్మెంట్ బీపీడీని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు.
దీనికి మెడిసిన్లు లేవు కానీ సైకోథెరపీలో భాగంగా, పేషంట్లకు వైద్యులు మెడిసిన్లు అందిస్తున్నారు.