Fried Rice Syndrome : సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 'ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్'.. ఇది చాలా డేంజర్ బ్రో
మిగిలిన ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేసి తింటే చాలా రోగాలొస్తాయని అందరికి తెలిసిందే. ఫిడ్జ్ వచ్చాక ఈ ఫుడ్ విషయంలో పెద్ద పట్టింపులు ఉండడం లేదు. కానీ హానికర బ్యాక్టీరియా కారణంగా మిగిలిన ఫుడ్ వేడి చేసి తిన్న వ్యక్తి మృతి చెందినట్లు వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దీని కారణం ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్(fried rice syndrome) అని చెబుతున్నారు. అయితే ఈ వ్యాధి లక్షణాల గురించి తెలుసుకుందాం. ఓ విద్యార్థి ఐదురోజుల పాటు కనీసం రిఫ్రిజిరేటల్ లో కూడా పెట్టని ఆహారాన్ని మైక్రోవేవ్ లో వేడి చేసి తిన్నాడు. దీంతో తలనొప్పి, కడుపునొప్పి వంటి లక్షణాలతో రాత్రికే రాత్రే చనిపోయాడు.
బాసిల్లస్ సెరియన్ అనే బ్యాక్టీరియా విషాన్ని ఉత్పత్తి చేస్తుంది
ఈ ఘటన జరిగి 15 సంవత్సరాలు గడుస్తున్నా మరోసారి సోషల్ మీడియా పోస్టులు 'ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్' గురించి మళ్లీ వెలుగులోకి తెచ్చాయి. వండిన ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచినప్పుడు బాసిల్లస్ సెరియన్ అనే బ్యాక్టీరియా ఫామ్ అయి ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. ఇది విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఒక్కొసారి మరణం కూడా సంభవించవచ్చు. ఇమ్యూనిటీ ఉంటే బతికే ఛాన్స్ ఉంటుంది. ఫుడ్ పాయిజనింగ్ బారిన పడకుండా ఉండాలంటే కావాల్సిన మొత్తంలో ఆహారాన్ని తయారు చేసుకొని తినడం మంచిది. లేదా మిగిలిన ఆహారాన్ని పారేయడానికి ప్రయత్నించాలి.