HMPV: హెచ్ఎంపీవీ అంటే ఏమిటి? వైరస్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలివే!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియాలో హెచ్ఎంపీవీ (హ్యుమన్ మెటాప్న్యూమోవైరస్) పేరుతో ఓ వైరస్ వ్యాప్తి చెందుతోంది.
ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, అహ్మదాబాద్, చెన్నై, కోల్కతా నగరాల్లో మొత్తం 5 కేసులు గుర్తించారు. ఇవి ఇప్పుడు 7కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా ప్రకటించారు.
ఇప్పటికే, చైనాలో హెచ్ఎమ్‌పివి కారణంగా శ్వాసకోశ సంబంధి జ్వరాలు పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ వల్ల ఆసుపత్రులకు పేషంట్లు క్యూ కడుతున్నారు.
తద్వారా ప్రజల్లో ఒక అనుకోని ముప్పు మొదలైనట్లు ఆందోళన కలిగింది. ముఖ్యంగా ఉత్తర ప్రావిన్సులలో ఈ వైరస్ తీవ్రంగా విస్తరిస్తుండగా, పిల్లలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు.
Details
మాస్కులు ధరించాలి
ఈ పరిణామం, గతంలో వుహాన్‌లో మొదలైన కోవిడ్-19 మహమ్మారి రోజులను గుర్తుకు తెచ్చినట్లు చెప్పొచ్చు. చైనా ఆసుపత్రుల్లో నిబంధనలుగా మాస్కులు ధరించి, వీలైనంతగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయినప్పటికీ ఈ పెరుగుదలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హెచ్ఎమ్‌పివి గురించి రూబీ హాల్ క్లినిక్ డాక్టర్ ప్రశి సాథే వివరణ ఇచ్చారు.
ఎంపివి వైరస్ అంటే ఏమిటి?
HMPV (హ్యుమన్ మెటాప్న్యూమోవైరస్) ఒక శ్వాసకోశ సంబంధిత వైరస్, ఇది పరామిక్సోవిరిడే కుటుంబానికి చెందింది.
ఈ వైరస్ ముక్కు, గొంతు, ఊపిరి ద్వారా శ్వాసకోశ సంక్రమణలను కలిగిస్తుంది. ఇది అన్ని వయస్సుల వారిని ప్రభావితం చేయగలదు.
ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు మరింత ప్రభావితమవుతారు.
Details
నివారణ మార్గాలు
తరచుగా చేతులు శుభ్రం చేయడం, మాస్కులు ధరించడం, దగ్గు లేదా చుమ్ము చేసేటప్పుడు చెయ్యి అడ్డుపెట్టుకోవడం, వైరస్ సోకిన వ్యక్తులకు దూరంగా ఉండాలి.
మంచి పోషకాహారం, వ్యాయామం, ఎక్కువగా నిద్రపోవడం
పెద్ద మహమ్మారిగా మారుతుందా?
HMPV యొక్క వ్యాప్తి చాలా స్థానికమైనది. COVID-19 వంటి పెద్ద మహమ్మారి పరిస్థితిని తీసుకొచ్చే అవకాశం లేదు.
దీని వల్ల రోగ నివారణ కోసం జాగ్రత్తలు తీసుకోవడం, వ్యాక్సినేషన్లపై దృష్టి పెట్టడం, కేసులను అంచనా వేసే ప్రక్రియలు కీలకం.
హెచ్ఎంపీవీ ఒక శ్వాసకోశ వైరస్, దీనికి సరైన జాగ్రత్తలు, వైద్య పరీక్షలు, అవగాహనతో ఈ వైరస్‌ను అరికట్టవచ్చు.