Page Loader
Sri Panchami, Vasantha Panchami: శ్రీ పంచమి, వసంత పంచమి ప్రాముఖ్యత ఏమిటి? పండితులు ఏం చెప్పారంటే?
శ్రీ పంచమి, వసంత పంచమి ప్రాముఖ్యత ఏమిటి? పండితులు ఏం చెప్పారంటే?

Sri Panchami, Vasantha Panchami: శ్రీ పంచమి, వసంత పంచమి ప్రాముఖ్యత ఏమిటి? పండితులు ఏం చెప్పారంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 01, 2025
10:05 am

ఈ వార్తాకథనం ఏంటి

జ్ఞానప్రాప్తి కోసం సరస్వతీ దేవిని ఆరాధించడం బ్రహ్మవైవర్త పురాణాల్లో నొక్కి చెప్పారు. ఆరాధన విధానాలను శ్రీమన్నారాయణుడు నారదునికి బోధించినట్లు దేవీ భాగవతంలో వెల్లడైంది. శ్రీ పంచమి రోజు రతీమన్మథులు, వసంత ఋతువు సంతోషంతో రంగులు చల్లుకుని ఆనందం వ్యక్తం చేశారు. అందుకే ఈ రోజు 'మదన పంచమి'గా ప్రసిద్ధి చెందిందని ప్రముఖ పండితులు పేర్కొన్నారు. విద్యా, జ్ఞాన దేవత అయిన సరస్వతీ దేవి జన్మదినం శ్రీ పంచమి. సరస్వతి అనగా కాంతి; కాంతి కలిగినది కావడం వల్ల ఆమెను సరస్వతి అని పిలుస్తారు. ఆమె అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞాన కాంతిని ప్రసరించే దేవత. సరస్వతి దేవి శ్వేత పద్మాసనంలో వీణ, పుస్తకము, జపమాల మరియు అభయ ముద్రలతో అలంకృతమైనది.

Details

గాయత్రీ దేవీ ఐదు రూపాలలో సరస్వతీ దేవం రూపం ఒకటి

గాయత్రీ దేవి ఐదు రూపాలలో ఒక రూపంగా సరస్వతీ దేవి ఉన్నారు. యాజ్ఞవల్క్యుడు తన గురుశాపం వల్ల విద్యను కోల్పోయిన తర్వాత, సూర్యదేవుని ఆరాధించి సరస్వతీ ఉపాసన పొందాడు. వసంత పంచమి రోజున సరస్వతీ ఆరాధనతో యాజ్ఞవల్క్యుడు స్మృతి శక్తిని పొందగలిగినట్లు పురాణాలు చెబుతున్నాయి. వాల్మీకి కూడా సరస్వతీ దేవిని ఆరాధించి శ్రీమద్రామాయణం రచించారు. వ్యాసుడు సరస్వతీ దేవి ఉపాసనతో వేద విభాగం చేసి, పురాణాలను ఆవిష్కరించి, మహాభారతం, భాగవతం, బ్రహ్మసూత్రం వంటి రచనలు చేసి భారతీయ సనాతన ధర్మానికి మూలాధారం ఇచ్చాడు. పోతన తన ఆంధ్ర మహాభాగవతాన్ని సరస్వతీ దేవికి అంకితం చేశారని పండితులు తెలియజేశారు.