వర్క్: జాబ్ లో సంతృప్తి లేకపోవడానికి కారణాలు
ఒక కంపెనీలో పనిచేసే ఉద్యోగి, తన జాబ్ పట్ల అసంతృప్తిగా ఫీలవుతుంటే ఆ కంపెనీపై అది ప్రభావం చూపిస్తుంది. మరసలు జాబ్ పట్ల అసంతృప్తిగా ఎందుకు ఉంటారు. ఏ కారణాల వల్ల చేస్తున్న ఉద్యోగంలో అసంతృప్తికి గురవుతారో తెలుసుకుందాం. పనిచేసే ప్రదేశాల్లో రిలేషన్స్ సరిగా లేకపోవడం: తోటి ఉద్యోగులతో సరైన బంధాలు లేనటువంటి ఉద్యోగాలు చేస్తుంటే అసంతృప్తి పెరుగుతుంది. కేవలం కంప్యూటర్ ముందు కూర్చోవడం, ఇంటికి వచ్చేయడం మాత్రం తప్ప కనీసం పక్కనున్న కొలీగ్స్ తో బంధాలు లేనట్లయితే అసంతృప్తి కలుగుతుంది. తక్కువ జీతం: తాము చేస్తున్న కంపెనీలో తమలాంటి వర్క్ చేస్తున్న వారికి ఎక్కువ జీతం ఇచ్చి, తమకు తక్కువ జీతం అందుతుంటే అసంతృప్తికి గురవుతారు.
ఉద్యోగుల్లో అసంతృప్తికి కారణాలు
పనిని, జీవితాన్ని సరిగ్గా బ్యాలన్స్ చేయలేకపోవడం: పనివేళలు కావాల్సిన దానికంటే మరింత ఎక్కువగా ఉండడం వల్ల అటు పని మీద దృష్టి ఉండదు. ఇటు పర్సనల్ లైఫ్ లోనూ సంతోషం ఉండదు. ఈ కారణంగా ఒత్తిడి ఎక్కువవుతుంటుంది. అసంతృప్తి పెరుగుతుంది. మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం: ఏ కంపెనీలో పనిచేసినా కంపెనీ మేనెజ్మెంట్ సరిగ్గా ఉంటేనే చేస్తున్న పనిపట్ల ఆసక్తి కలుగుతుంది. మేనేజ్మెంట్ ఊరికే కాల్చుకు తింటుంటే పని చేయాలన్న మూడ్, ఉత్సాహం అన్నీ కోల్పోయి నీరసం కమ్మేస్తుంది. నో ప్రమోషన్స్: చేస్తున్న పనిలో ప్రమోషన్స్ వస్తేనే ఆ పని చేయాలన్న కోరిక ఇంకా పెరుగుతుంది. ఎలాంటి ప్రమోషన్ లేనపుడు ఎందుకు పనిచేయాలన్న ఆలోచన కలిగి మనసులో ఒకరమైన నీరసం వస్తుంది.